twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇషాతోడ్యాన్స్, కొత్తవిలన్‌తో ఫైట్స్: త్వరలో మి.పెళ్లి కొడుకు

    By Srinivas
    |

    Mr Pelli Koduku
    అందాల రాముడు సినిమా నుండి కమేడియన్ కమ్ హీరోగా వెలుగొందుతున్న సునీల్ నటిస్తున్న తాజా మిస్టర్ పెళ్లి కొడుకు చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ముగించుకొని తుది మెరుగులు దిద్దుకుంటోంది. సునీల్ కథానాయకుడిగా అందాల రాముడు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ప్రై.లిమిటెడ్ సంస్థ అందించింది. అదే సంస్థ మిస్టర్ పెళ్లి కొడుకు చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సందర్భంగా మెగా సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత చిత్ర సమర్పకులు ఆర్ బి చౌదరి మాట్లాడారు.

    సునీల్‌తో తాము నిర్మిస్తున్న మిస్టర్ పెళ్లి కొడుకు చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయన్నారు. జనవరి నెలలో ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేసి సినిమాని అతి త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. చిత్ర నిర్మాతలలో ఒకరైన యన్ వి ప్రసాద్ మాట్లాడుతూ... సునీల్ హీరోగా తాము నిర్మిస్తున్న ఈ చిత్రం అందరూ మెచ్చే విధంగా నవరసభరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు.

    సునీల్ మిస్టర్ పెళ్లి కొడుకుగా అందరి అభినందనల్ని అందుకుంటారని చెప్పారు. మరో నిర్మాత పారస్ జైన్ మాట్లాడుతూ... దర్శకుడు దేవి ప్రసాద్ ఈ చిత్రాన్ని అన్ని తరగతుల వారు మెచ్చే విధంగా మలిచారన్నారు. ఇందులో సునీల్ అద్భుతంగా నటించారని, ఖర్చుకు వెనుకాడకుండా దీన్ని భారీ ఎత్తున నిర్మించామని చెప్పారు. మిస్టర్ పెళ్లి కొడుకుగా సునీల్ సూపర్‌గా చేశారని, ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందన్నారు.

    సునీల్ సరసన ఇషా చావ్లా కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, యల్బీ శ్రీరాం, ఆహుతి ప్రసాద్, రవి బాబు, ఎంఎస్ నారాయణ, తులసి, ఉషశ్రీ, అర్చన, భవాని తదితరులు నటిస్తున్నరు. విలన్‌గా విన్సెంట్ అనే కొత్త నటుడు పరిచయమవుతున్నాడు.

    సాంకేతిక బృందం : సంగీతం - యస్ఏ రాజ్ కుమార్, ఛాయాగ్రహనం - సమీర్ రెడ్డి, కళ - యంఎస్ రవి కుమార్, ఫైట్స్ - కనల్ కణ్నన్, డ్రాఘన్ ప్రకాశ్, సాల్మన్, నృత్య దర్శకులు - భాను, బాలు, ఎడిటింగ్ - నందమూరి హరి, కో డైరెక్టర్స్ - బ్రహ్మాజీ, విజయ్ కుమార్, ప్రొడక్షన్ - భీమనేని రాయుడు, సమర్పణ - ఆర్ బి చౌదరి, నిర్మాతలు యన్ వి ప్రసాద్, పారాస్ జైన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - దేవి ప్రసాద్

    English summary
    Producers of Mr Pelli Koduku film said that they are plannig to release audio in January.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X