సునీల్ ‘మిస్టర్ పెళ్లి కొడుకు’ లెటెస్ట్ ఇన్ఫో..
హైదరాబాద్: కమెడియన్ సునీల్ హీరోగా 'అందాల రాముడు' చిత్రాన్ని రూపొందించిన మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ తాజాగా హిందీలో హిట్టయిన 'తను వెడ్స్ మను'ను చిత్రాన్ని సునీల్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దేవిప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్త అయింది. ఈ చిత్రానికి 'మిస్టర్ పెళ్లి కొడుకు' అనే టైటిల్ ఖరారు చేసారు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బేనర్లో వస్తున్న 11వ చిత్రం ఇది.
ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన యన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ... 'ఈ చిత్రం అందరూ మెచ్చే నవరస భరిత కథా చిత్రంగా ఉంటుంది. ఎక్కడా దేనికీ కాంప్రమైజ్ అవ్వకుండా కథ డిమాండ్ మేరకు ఆయా లొకేషన్లలో చిత్రీకరణ జరిగింది. ఈచిత్రానికి గాను హీరో సునీల్ కి హీరోయిన్ ఇషా చావ్లాల దుస్తుల్ని హాంకాంగ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించి ఉపయోగించడం జరిగింది. అందరూ మెచ్చే కథతో అన్ని తరగతుల ప్రేక్షకుల మెప్పుని పొందుతుంది' అన్నారు.
మరో నిర్మాత పారస్ జైన్ సినిమా ప్రొగ్రెస్ గురించి చెబుతూ 'మేము అందాల రాముడు తర్వాత సునీల్ తో చేస్తున్న 'మిస్టర్ పెళ్లి కొడుకు' చిత్రానికి సంబంధించి ఒక్క పాటను చిత్రీకరించాల్సిఉంది. దీన్ని డిసెంబర్ మొదటి వారంలో చేస్తాము. ప్రస్తుతం ఈ పాటకు గాను ప్రత్యేకంగా సెట్స్ ని మా కళాదర్శకుడు యం.ఎస్.కుమార్ వేస్తున్నారు. దర్శకుడు దేవిప్రసాద్ అహర్నిశలు శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం. క్లాసు, మాసు అన్ని తరగతుల వారికి నచ్చే చిత్రంగా ఉంటుంది' అన్నారు.
సునీల్ సరసన ఇషా చావ్లా కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎల్.బి.శ్రీరామ్, ఆహుతి ప్రసాద్, రవిబాబు, ఎంఎస్ నారాయణ, తులసి, ఉషశ్రీ, అర్చన, భవాని తదితరులు నటిస్తున్నారు. విల్ పాత్రలో విన్సెంట్ అనే కొత్త నటుడు పరిచయం అవుతున్నాడు. టెక్నీషియన్స్ వివరాల్లోకి వెళితే... సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్, కెమెరా: సమీర్ రెడ్డి, కళ: ఎంఎస్ కుమార్, ఫైట్స్: కనల్ కన్నన్, డ్రాఘన్ ప్రకాష్, సాల్మన్, నృత్య దర్శకులు: భాను, బాలు, ఎడిటింగ్: నందమూరి హరి, కో-డైరెక్టర్స్: ఎన్.బ్రహ్మాజీ, విజయ్ కుమార్, ప్రొడక్షన్: భీమినేని రాయుడు. ఈ చిత్రానికి సమర్పకులు: ఆర్.బి.చౌదరి, నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్, దర్శకత్వం: దేవి ప్రసాద్.


Click it and Unblock the Notifications











