twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంకా 15 రోజుల షూటింగ్ బ్యాలెన్స్.. ‘లవ్ స్టోరీ’పై సునీల్ నారంగ్ కామెంట్స్

    |

    సునీల్ నారంగ్ ఇంతవరకు డిస్ట్రీబ్యూటర్‌గానో, మహేష్ బాబు ఏఎంబీ సంస్థలో భాగస్వామిగానో తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. అయితే మంచి అభిరుచి ఉన్న ఓ గొప్ప నిర్మాతగా త్వరలోనే ప్రేక్షకులకు తెలియబోతోంది. మామూలుగా అయితే ఇప్పటికే నిర్మాతగా లవ్ స్టోరీ సినిమాతో మంచి నిర్మాత అనే పేరును సంపాదించుకునేవారు. కరోనా వైరస్ వల్ల షూటింగ్‌లన్నీ క్యాన్సల్ అవడంతో లవ్ స్టోరీ వాయిదా పడింది. సోమవారం (జూలై 27) సునీల్ నారంగ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలు విషయాలపై మాట్లాడుతూ.. లవ్ స్టోరీ చిత్రంపై కామెంట్ చేశారు.

    పుట్టినరోజు సందర్భంగా సునీల్ నారంగ్ మాట్లాడుతూ... 'చిత్ర పరిశ్రమ నాకు తల్లి లాంటిది. 30 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీతో నాకు అనుబంధం ఉంది. ఈ పరిశ్రమ నాపై కొన్ని బాధ్యతలు పెట్టంది. వాటిని సక్రమంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తాను. అలాగే సినిమా మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ఆ ప్రేమే నన్ను చిత్ర పరిశ్రమలోని వివిధ విభాగాల్లో అడుగుపెట్టేలా చేస్తోంది.సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏఎంబీ సినిమాస్ మల్టీఫ్లెక్స్ నిర్మాణంతో ప్రేక్షకులకు అత్యుత్తమ సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ కల్గించాము.

    Sunil Narang On His Birthday About Love Story Movie

    అంతే గాకుండా ఇప్పుడు మేము నిర్మాణ రంగం లోకి ఎంటర్ అయ్యాం. ఏమిగోస్ క్రియేషన్స్, పి రామ్మోహన్ రావుతో కలిసి "లవ్ స్టోరీ" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నా. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉండగా కరోనా లాక్ డౌన్ మొదలైంది.ఇంకా 15 రోజుల షూటింగ్ చేయాల్సి ఉంది. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత మిగతా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేస్తాం.మాకు శేఖర్ కమ్ముల పనితనం బాగా నచ్చింది.అందుకే మా తర్వాతి సినిమా కూడా ఆయన తోనే చేయబోతున్నాం.ఒక పెద్ద హీరో తో ఆ మూవీ ఉంటుంది.దానికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తామ'ని ప్రకటించారు.

    English summary
    Sunil Narang On His Birthday About Love Story Movie. Due To Lockdown Shooting Has been Cancelled. Ony15 days of shooting is remained.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X