సునీల్ కొత్త చిత్రాన్ని ప్రారంభించిన వెంకీ
సునీల్ హీరోగా ఉదయశంకర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. తొలి సన్నివేశానికి వెంకటేష్ క్లాప్ ఇవ్వగా, డి రామానాయుడు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ..''సురేష్ ప్రొడక్షన్స్ లో చాలా సినిమాల్లో నటించాను. హీరోగా ఈ బ్యానర్లో నాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ విత్ పాన్, ఐస్ క్రీమ్ లా ఉంటుందని, నా సినిమాల్లో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయన్నారు.
దర్శకుడు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ....ఈ కథకి సునీల్ పర్ ఫెక్టుగా సూటవుతాడని అతన్ని హీరోగా ఎంచుకున్నాము. ఎంటర్‌టైన్మెంట్ అండ్ కామెడీకి ఫుల్ స్కోపు ఉన్న సినిమా. సునీల్ బర్త్ డే రోజు ఈ కథను ఆయనకు రెండు గంటలపాటు వివరించాను. బర్తడే గిఫ్ట్ గా నా సినిమాలో హీరోగా చేయడానికి ఆయన ఒప్పుకున్నారు అని చెప్పారు.
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ...సునీల్ తో ఎప్పటి నుంచో మా బ్యానర్లో సినిమా చేయాలనుకుంటున్నాము. ఈ రోజుతో అది కుదిరింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి విశేషాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈచిత్రానికి కథ : కవి కాళిదాస్, మాటలు : శ్రీధర్ సీపాన, ఆర్ట్ : వివేక్, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శేఖర్ వి.జోసెఫ్, సంగీతం : మణి శర్మ, సమర్పణ : డా. డి రామానాయుడు, నిర్మాత, సురేష్ బాబు, దర్శకత్వం-స్క్రీన్ ప్లే : ఉదయ్ శంకర్.


Click it and Unblock the Notifications











