'నాకేంటి?' అంటున్న సునీల్

By Srikanya

రవితేజతో ఆంజనేయులు చిత్రం రూపొందించిన పరుశరామ్ (బుజ్జి)..సునీల్ తో సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి 'నాకేంటి?' అనే టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే కథ ప్రకారం సునీల్ ఊతపదం 'నాకేంటి?' అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఇంతకుముందు అజయ్ తో ఆ ఒక్కడు, జగపతి బాబుతో ప్రవరాఖ్యుడు నిర్మించిన టాలీ టు హాలీ సంస్ధ వారు నిర్మించనున్నారు. జూన్ నెలాఖరుకు ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనుంది. పరుశరామ్ మొదట తన స్క్రిప్టుని గోపీచంద్ హీరోగా రాసుకుని సంప్రదించారు. కొద్ది నెలలు పాటు సిట్టింగ్స్ జరిగాయి. అయితే స్క్రిప్టులో గోపీచంద్ మేజర్ మార్పులు సూచించటంతో పరుశరామ్ బయిటకు వచ్చి సునీల్ తో ఓకే చేయించుకున్నాడని తెలుస్తోంది. ఆంజనేయులు, యువతలో కామెడీ పార్ట్ బాగా పండటంతో సునీల్ చిత్రం కూడా బాగానే నవ్విస్తాడని ఆశించవచ్చు. ఇక ప్రస్తుతం సునీల్...రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న చిత్రంలో చేస్తున్నారు. సలోని అతని సరసన చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X