నాగార్జునకే కాకుండా సునీల్ కు కూడా రాజమౌళి...
రాజమౌళి, సునీల్ కాంబినేషన్ లో వచ్చిన మర్యాద రామన్న చిత్రం విజయం సాధించటంతో వరసగా సునీల్ కు ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. అందులోనూ పన్నెండేళ్ళ తర్వాత రామ్ గోపాల్ వర్మ డైరక్ట్ చేస్తున్న డైరక్ట్ తెలుగు సినిమా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు లోనూ సునీల్ నే హీరోగా ఎన్నుకోవటం కూడా కలిసి వచ్చింది. ఈ నేఫధ్యంలో సునీల్ మరో సినిమా కమిటయ్యారు. రాజమౌళి కో-డైరక్టర్ కోటి దర్శకత్వం వహించే ఈ చిత్రం కూడా పూర్తి ఎంటర్టైన్మెంట్ తో సాగనుందని సమాచారం. అలాగే ఈ చిత్రానికి శివం అనే టైటిల్ పెట్టనున్నారని సమాచారం. అలాగే ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ ని రాజమౌళి డైరక్ట్ చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున హీరోగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి యాక్షన్ ఎపిసోడ్స్ ని రాజమౌళి డైరక్ట్ చేస్తున్నారనే సంగతి తెలిసింది.


Click it and Unblock the Notifications











