చివరి షెడ్యూల్‌లో సునీల్ మూవీ
సునీల్, ఇషాచావ్లా కాంబినేషన్‌లో పూలరంగడు తర్వాత మళ్ళీ మరో చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మూవీ 'తను వెడ్స్ మను' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈచిత్రాన్ని మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై ఎన్.వి. ప్రసాద్, పరాస్‌జైలు నిర్మిస్తున్నారు. దేవీప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవలే భద్రాచలంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ జూలై 26న హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. సునీల్, ఇతర తారాగణంపై పలు కీలక సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో ఈ చిత్రం షూటింగ్ పార్టు పూర్తి కానుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎక్కడా మిస్ కాకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కావాల్సి ఉంది. సునీల్ కెరీర్‌లో మరో మంచి చిత్రమవుతుంది చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. సాధారణంగా సునీల్ సినిమా అనగానే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునే హాస్యం కోరుకుంటారు. బ్లేడ్ బాబ్జీ లాంటి కామెడీ చిత్రాలకు దర్శకత్వం వహించిన దేవి ప్రసాద్ ఈచిత్రాన్ని హాస్య భరితంగా రూపొందిస్తాడనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు.
మరో వైపు సునీల్ తమిళ చిత్రం "వేట్టై" తెలుగు రీమేక్ కూడా కమిట్ అయ్యారు. సునీల్, నాగచైతన్య హీరోలుగా ఈ చిత్రాన్ని రూపొందించతోతున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన హన్సిక, సునీల్ సరసన ఆండ్రియా ఎంపికైనట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











