సునీల్ కి ఆ బిరుదు తగలించారు
హాస్య నటుడు నుంచి పూర్తి స్ధాయి హీరోగా మారిన సునీల్ కు ఇప్పుడో కొత్త బిరుదు చేరింది. ఆయన తాజా చిత్రం పూలరంగడులో సూపర్ రాజా సునీల్ అని వేస్తున్నారు. రవితేజకు మాస్ మహారాజా, అల్లరి నరేష్ కు మాస్ రాజా అనే బిరుదులు ఉన్న నేపధ్యంలో సునీల్ కు ఈ బిరుదుని తగిలించి పోస్టర్స్ వేస్తున్నారు. ఈ చిత్రం పిబ్రవరి 18న విడుదల కానుంది. పూర్తి కామిడీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంపై సునీల్ కు చాలా అంచనాలు ఉన్నాయి. వర్మ దర్శకత్వంలో రూపొందిన అప్పలరాజు చిత్రం డిజాస్టర్ కావటంతో ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు.
అలాగే ఈ చిత్రంలో సునీల్ సిక్స్ ప్యాక్ లో కనిపించి మురిపించటానికి రెడీ అవుతున్నారు. క్లైమాక్స్ ఫైట్ లో ఈ సిక్స్ ప్యాక్ ప్రదర్శన ఉంటుందని సమాచారం. అల్లరి నరేష్ తో అహనా పెళ్లంట అనే చిత్రం తీసి హిట్ కొట్టిన వీరభద్ర చౌదరి ఈ చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం దిలీప్ ...మళయాళంలో చేసిన పండిపడ చిత్రం ఆధారంగా రూపొందిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. యూనిట్ మొత్తం ఈ చిత్రం విజయంపై కాన్ఫిడెంట్ గా ఎదురుచూస్తున్నారు. బిజినెస్ మ్యాన్ నిర్మించిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సునీల్ కెరీర్ లోనే ఎక్కువ ప్రింట్స్ తో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











