బూతు దర్శకుడుతో సునీల్ నెక్ట్స్ చిత్రం ఖరారు
హైదరాబాద్ :కమిడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ తాజాగా మరో కొత్త చిత్రం కమిటయ్యారు. రీసెంట్ గా రిలీజై బూతు చిత్రం అని పేరు తెచ్చుకున్న 'బస్‌స్టాప్' ఫేమ్ మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. గీతా ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు మారుతి మీడియాకు ఖరారు చేసారు. ఆయన మాట్లాడుతూ..''గీతా ఆర్ట్స్ పతాకంపై ఓ సినిమా రూపొందిస్తున్నాం. అందులో సునీల్ హీరోగా నటించే అవకాశాలున్నాయి''అన్నారు.
సునీల్ హీరోగా 'అందాల రాముడు' చిత్రాన్ని రూపొందించిన మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ తాజాగా హిందీలో హిట్టయిన 'తను వెడ్స్ మను'ను చిత్రాన్ని సునీల్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దేవిప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్త అయింది. ఈ చిత్రానికి 'మిస్టర్ పెళ్లి కొడుకు' అనే టైటిల్ ఖరారు చేసారు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బేనర్లో వస్తున్న 11వ చిత్రం ఇది.
ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన యన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ... 'ఈ చిత్రం అందరూ మెచ్చే నవరస భరిత కథా చిత్రంగా ఉంటుంది. ఎక్కడా దేనికీ కాంప్రమైజ్ అవ్వకుండా కథ డిమాండ్ మేరకు ఆయా లొకేషన్లలో చిత్రీకరణ జరిగింది. ఈచిత్రానికి గాను హీరో సునీల్ కి హీరోయిన్ ఇషా చావ్లాల దుస్తుల్ని హాంకాంగ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించి ఉపయోగించడం జరిగింది. అందరూ మెచ్చే కథతో అన్ని తరగతుల ప్రేక్షకుల మెప్పుని పొందుతుంది' అన్నారు.


Click it and Unblock the Notifications











