సిక్స్ ప్యాక్‌తో ఓవర్ చేద్దామని కాదు: సునీల్
తన తాజా సినిమా 'పూల రంగడు'లో హీరో సునీల్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్న సంగతి తెలిసిందే. కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన ఈ హీరో చేసిన రెండు సినిమాలకే సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొదట్లో అయితే అది గ్రాఫిక్స్ మాయే అన్న వాళ్లూ లేక పోలేదు. బుధవారం సాయంత్రం జరిగిన పూలరంగడు ఆడియో వేడుక సందర్భంగా తన సిక్స్ ప్యాక్ బాడీపై వివరణ ఇచ్చాడు సునీల్.
ఓవర్ చేద్దామని...సిక్స్ ప్యాక్ బాడీ చేయలేదని, ప్రేక్షకులు నన్ను చూసి నవ్వ కూడదనే ఉద్దేశ్యంతోనే చేశానని చెప్పాడు. తనకు చిన్నప్పటి నుంచి బాడీబిల్డర్ కావాలని ఆశ ఉండేదని, సినిమాల్లో కమెడియన్ గా చేరిన తర్వాత వీలు కాలేదని చెప్పకొచ్చాడు. నేను ఇప్పటి వరకు 160 సినిమాల్లో కమెడియన్ గా నటించాను. పెద్దల ఆశీర్వాదం వల్ల హీరోగా ఎదిగాను. ఓ కమెడియన్ హీరోగా మారి థియేటర్లో విలన్లను కొడుతుంటే ఎవరూ నమ్మరు, పైగా నవ్వుతారు. నన్ను చూసి ఎవరూ అలా నవ్వ కూడదనే సిక్స్ ప్యాక్ బాడీ చేశానని సునీల్ చెప్పకొచ్చాడు.
పూల రంగడు సినిమా యాక్షన్ సినిమా ఎంత మాత్రం కాదని, నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ మూవీ, క్లైమాక్స్ లో ఓ ఫైట్ మాత్రమే ఉంటుందని సునీల్ వెల్లడించాడు. మర్యాద రామన్న సినిమాలో అందాల రాముడు తిరిగినట్లు...ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఉటుందన్నాడు.
సనీల్, ఇషా చావ్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











