Don't Miss!
- Technology Vivo కొత్త ఫోన్ Vivo V30e వివరాలు లీక్! లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్లు
- Finance Elon Musk: ఎలాన్ మస్క్‌కి మోదీ సర్కార్ అండ.. అంబానీకి పెద్ద దెబ్బే..!!
- News జనసేనకు గాజు గ్లాస్ గుర్తుపై హైకోర్టులో భారీ ఊరట..!
- Lifestyle Banana Milkshake వేసవి తాపానికి బనానా మిల్క్ షేక్ బాడీ కూల్ చేస్తుంది..ఆరోగ్యకరమైనది కూడా..
- Sports రాయల్ ఛాలెంజర్స్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్
- Automobiles ఇన్నోవా హైక్రాస్ కొత్త వేరియంట్ వచ్చేసింది - ధర, వివరాలు ఇక్కడ చూడండి
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
హను రాఘవపుడి సినిమాలో సునీల్!
యంగ్ హీరో శర్వానంద్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం 'పడి పడి లేచే మనసు'. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కబోతోంది.
కలకత్తాలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుతోంది. ఈ షూటింగ్ లో సునీల్ జాయిన్ కాబోతున్నాడు. సునీల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. వెన్నెల కిషోర్ కూడా చిత్ర సెట్స్ లో పాల్గోవడం జరిగింది.
ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వెలుగొందిన నటుడు సునీల్ తర్వాత హీరోగా మారి చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కామెడి పాత్రలు చేస్తున్నాడు. శ్రీను వైట్ల, రవితేజ సినిమాలో కూడా సునీల్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. శర్వా ఈ సినిమాలో ఇప్పటివరకూ కనిపించని విధంగా న్యూ లుక్‌లో వెండితెర దర్శనమీయనున్నాడు.