జనవరి 5న ‘పూల రంగడు’ ఆడియో
కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్ త్వరలో 'పూల రంగడు'గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇషా చావ్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి వీరభద్రం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోను జనవరి 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనుప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
సునీల్ కెరియర్ లోనే అత్యధికంగా దాదాపు 450 ప్రింట్లతో విడుదలవుతున్న ఈ సినిమా జనవరి 14న థియేటర్లలో దూకుతోంది. ఒకప్పుడు కామెడీ ఫేసుతో, లావెక్కిన శరీరంతో ఉండే సునీల్....ఈ సారి యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా అబ్బుర పడేలా సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనం ఇవ్వనున్నాడు.
ఇప్పటికే టాకీ పార్టు మొత్తం పూర్తి చేసుకున్న పూల రంగడు సినిమా...ప్రస్తుతం పాటల చిత్రకరణ జరుపుకుంటోంది. ఈవారంలో ఈ పనులు కూడా పూర్తి చేసుకని జనవరి మొదటి వారంలో ప్రోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకోనుంది.
ఆర్ ఆర్ మూవీ మేకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, అలి, ప్రదీప్ రావత్. దేవ్ గిల్, పృథ్వి, సుధ, ప్రగతి, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, ఖలీల్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











