రికార్డు స్ధాయిలో సునీల్ సినిమా ప్రింట్స్
సునీల్ తాజా చిత్రం 'పూలరంగడు' జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 450 ప్రింట్లతో విడుదల చేస్తున్నారు. ఈ విషయం నిర్మాత అచ్చిరెడ్డి చెపుతూ... సునీల్ ఈ సినిమాలో కొత్తగా కనిపించబోతున్నాడు. 450 ప్రింట్లతో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. సునీల్ కెరీర్‌లోనే ఇది రికార్డ్. ప్రస్తుతం మిగిలివున్న మూడు పాటలు, పోస్ట్ ప్రొడక్షన్‌వర్క్ జరుగుతోంది అన్నారు. ఇక దర్శకుడు వీరభద్ర చౌదరి మాట్లాడుతూ...సునీల్ అనగానే అందాలరాముడు, మర్యాదరామన్న సినిమాలు గుర్తొస్తాయి. జనవరి 14న విడుదల కానున్న మా 'పూలరంగడు' ఆ సినిమాలను మరిపిస్తుంది. అందరి సహకారం వల్లే అనుకున్న టైమ్‌కి సినిమాను పూర్తి చేయగలిగాను అని చెప్పుకొచ్చారు.
ఇక మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం మూడు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో వరంగల్ లో ఉండే రంగా గా సునీల్ కనపిస్తాడు.అతనికి అనిత (ఇషా ఛావ్లా)అంటే విపరీతమై ప్రేమ.ఆమె లేని జీవితాన్ని వూహించుకోలేను అంటాడు రంగా. వరంగల్ వీధుల్లో టిప్‌టాప్‌గా,ఎలాంటి బాధ్యతలూ లేకుండా తిరిగే అతను ప్రేమ వలలో చిక్కుకొన్నాక ఏం జరిగిందో తెర మీదే చూడాలి. ఇంతకీ అనిత అతన్ని ప్రేమించిందా? లేదా అన్నది ఈ కథ. ఇషాచావ్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్‌రావత్, రఘుబాబు, దేవ్‌గిల్, పృథ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, దువ్వాసి మోహన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపన, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ప్రసాద్ మురెళ్ల, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్.


Click it and Unblock the Notifications











