సునీల్ కెరియర్‌లోనే బంపర్ రిలీజ్...
కామెడీ స్టార్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్ మర్యాద రామన్న సినిమా ద్వారా హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం సునీల్ నటిస్తున్న చిత్రం "పూల రంగడు". ఇషా చావ్లా ఈ చిత్రంలో సునీల్ సరసన నటిస్తోంది. ఇప్పటి వరకు సునీల్ కెరియర్ లోనే ఈ సినిమా బంపర్ రిలీజ్ గా నిలవబోతోంది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై వీర భద్రం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న 450 థియేటర్లలో వరల్డ్ వైడ్ గా సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి నాలుగు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ప్రేమకావాలి చిత్రానికి సూపర్ హిట్ సంగీతం అందించి అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
సునీల్, ఇషా చావ్లా, కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్ రావత్, రఘుభాబు, దేవ్ గిల్, పృథ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, ఖలీల్, ప్రవీణ్, వేణుగోపాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : శ్రీధర్ సీపన, ఎడిటింగ్ : గౌతం రాజు, సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, కాస్ట్యూమ్స్ : ప్రసాద్


Click it and Unblock the Notifications











