బడా హీరోలకు భయపడనంటున్న కమెడియన్ సునీల్...!?
తెలుగు బడా హీరోలు సంక్రాతి యుద్ధానికి శంఖం పూరిస్తున్నారు. టాప్ హీరోలు తమ చిత్రాల రిలిజ్ డేట్స్ ని ఎనౌన్స్ చేస్తున్నారు. సంక్రాంతి పందెంలో పోటీ పడేందుకు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఒక్కొక్కరుగా సంక్రాతి రాజు పోటీకి సిద్ధమౌతున్నారు. ఈసారి సంక్రాంతి పోరు రసవత్తరంగా మారనుంది. అధినాయకుడు చిత్రంతో బాలకృష్ణ, ది బిజినెస్ మేన్ సినిమాతో మహేష్ బాబు, గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్, నిప్పుతో రవితేజ సంక్రాతి పోరుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు వీరి రేస్ లోకి కమేడియన్ కమ్ హీరో సునీల్ కూడా చేరబోతున్నాడు.
కమెడియన్ నుంచి హీరోగా ఎదిగిన సునీల్ బడా హీరోలకే సవాల్ విసురుతున్నాడు. పూలరంగడి రూపంలో సంక్రాంతి బరిలో దిగుతూ పోటీకి సై అంటున్నాడు. భారీ చిత్రాలు సంక్రాంతి పోటీలో ఊన్నా....నేను సైతం అంటూ దూసుకొస్తున్నాడు.
అందాల రాముడు, మర్యాదరామన్న వంటి సినిమాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు... కమెడియన్ సునీల్. హాస్యనటుడిగా అనేక చిత్రాల్లో అలరించిన సునీల్ కు హీరోగానూ మంచి డిమాండ్ ఉంది. అయితే.... అప్పల్రాజు పరాజయం కావడంతో ఒక్కసారిగా కెరీర్ గాడితప్పినట్టయ్యింది.
అయితే సునీల్ ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నాడు. ఈ హీరో చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలున్నాయి. వాటిలో పూలరంగడు ఒకటి. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ బ్యానర్ లో వీరభద్రం చౌదరి దర్శకత్వంలో కె అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి జనవరి 14న సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సునీల్ కెరీర్ లోనే హయ్యెస్ట్ ప్రింట్స్ తో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాత అచ్చిరెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాతో హీరోగా తన కెరీర్ గాడిలో పడుతుందని సునీల్ చాలా నమ్మకంతో ఉన్నాడు. అయితే సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీలో ఉన్నా... పూలరంగడు మాత్రం ఏమాత్రం భయపడకుండా సమరానికి సై అంటున్నాడు.సినిమాపై ఉన్న నమ్మకంతోనే... సంక్రాంతి సమరానికి సిద్ధం అంటున్నారు.


Click it and Unblock the Notifications











