సునీల్‌ 'పూల రంగడు' స్టోరీ లైన్

By Srikanya

సునీల్, వీరభద్ర చౌదరి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'పూలరంగడు'.ఈ చిత్రంలో వరంగల్ లో ఉండే రంగా గా సునీల్ కనపిస్తాడు.అతనికి అనిత(ఇషా ఛావ్లా)అంటే విపరీతమై ప్రేమ.ఆమె లేని జీవితాన్ని వూహించుకోలేను అంటాడు రంగా. వరంగల్‌ వీధుల్లో టిప్‌టాప్‌గా,ఎలాంటి బాధ్యతలూ లేకుండా తిరిగే అతను ప్రేమ వలలో చిక్కుకొన్నాక ఏం జరిగిందో తెర మీదే చూడాలి. ఇంతకీ అనిత అతన్ని ప్రేమించిందా? లేదా అన్నది ఈ కథ.ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ సమర్పిస్తున్న ఈ చిత్రం మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతోంది.సంక్రాంతి బరిలోకి ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''సునీల్‌ శైలిలో ఆద్యంతం సరదాగా సాగే చిత్రమిది. వినోదంతోపాటు భావోద్వేగాలనీ చూపించే కథ ఇది. జనవరి 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.సునీల్ కెరీర్‌లోనే అత్యధిక ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.

మా 'ప్రేమకావాలి'ఘన విజయాన్ని సాధించింది.ఈ చిత్రం కూడా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో అంతటి విజయాన్ని మూటగట్టుకుంటుందన్న నమ్మకం ఉంది.అనూప్ మంచి బాణీలను అందిస్తున్నారు.మా సంస్థలో గొప్ప చిత్రంగా మిగులుతుంది''అని అన్నారు.సునీల్ నటించిన గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని, ఇందులో ఆయన కామెడీ కొత్త పుంతలు తొక్కుతుందని దర్శకుడు వీరభద్రచౌదరి చెబుతున్నారు.కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్‌రావత్, రఘుబాబు, దేవ్‌గిల్, పృధ్వీ, సుధ, ప్రగతి, శ్రీలలిత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపన, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్, నిర్మాణం: మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X