ఇషాఛావ్లాతో క్లోజెనెస్ గురించి సునీల్ ...
హైదరాబాద్ : సునీల్, ఇషాఛావ్లా కాంబినేషన్ లో పూల రంగడు, మిస్టర్ పెళ్లి కొడుకు చిత్రాలు వచ్చాయి. అంతేకాక ఈ మధ్య ఇషా చావ్లాతో కాస్త క్లోజ్‌గా ఉంటున్నారని ఓ గాసిప్ వినిపించింది. ఈ నేపధ్యంలో ఆయన్ని ఈ విషయమై మీడియా వారు ప్రశ్నించారు. దానికి సునీల్ పాజిటివ్ గా సమాధానమిస్తూ ఖండిచారు.
సునీల్ మాట్లాడుతూ..... రెండు సినిమాలు చేశాగా. రెండు సినిమాలు ఒకే హీరోయిన్‌తో చేస్తే ఇలాంటి గాసిప్పులు రావడం కామన్. కృష్ణ, శ్రీదేవి ఓ పది సినిమాలు చేశారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకున్నారా? ఇక్కడ ఏది చెబితే అది చేసే అమాయకులైతే లేరు. ఏది అడిగితే అది ఇచ్చేసే మొహమాటస్తులూ లేరు. ఎవరికాళ్లు ముదుర్లే అన్నారు.
అలాగే సినిమా అంటే శక్తిమంతమైన మాధ్యమం. దానిపై ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కలిసి టీ తాగుతున్నా, కలిసి డిన్నర్ చేసినా ఫొటోనో, లేక వార్తో బయటకొస్తుంది. దానికి నాలుగు మసాలా దినుసులు యాడ్ చేసి చక్కని బిర్యానీ లాంటి గాసిప్పులను తయారు చేస్తారు. నీకో విషయం తెలుసా? సినిమా వాళ్లు పబ్‌లకు కూడా పెద్ద వెళ్లరు. ఎవరో ఒకరు, ఇద్దరు తప్ప అన్నారు.
ఇక 'పూలరంగడు' టైమ్‌లో 'కమెడియన్ సునీల్ పక్కన నువ్వేంటి?' అని మాగ్జిమమ్ ఆ అమ్మాయిని వెనక్కి లాగడానికి చూశారట చాలామంది.'ఓ హీరో కమెడియన్ అవ్వలేడు కానీ, ఓ కమెడియన్ తప్పకుండా హీరో అవ్వగలడు' అని వాళ్లకు సూటిగా చెప్పి 'పూలరంగడు'లో నటించారు ఇషా అని చెప్పారు.


Click it and Unblock the Notifications











