సునీల్, రామ్ గోపాల్ వర్మ చిత్రం ఓపినింగ్ విశేషాలు
రామ్ గోపాల్ వర్మ, సునీల్ కాంబినేషన్ లో రూపొందనున్న కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు చిత్రం ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఈ రోజు (ఆగస్టు 27) ఉదయం పన్నెండు గంటలకు ఓపెన్ అయ్యింది. సునీల్ పై అతిలోక సుందరి శ్రీదేవి క్లాప్ కొట్టి శుభాకాంక్షలు తెలిపింది. అలాగే ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ చిత్రంలోని ఓ పాటను ప్లే చేసి వినిపించారు. ఆ పాటలో తెలుగు సినిమా దర్శకులనందరినీ విమర్శిస్తూ సాగుతుంది. ఈ పాట నేపద్యాన్ని రామ్ గోపాల్ వర్మ వివరించారు. అమలాపురం అనే పల్లె నుంచి వచ్చిన అప్పలరాజు ఎంతో కాన్ఫిడెంట్ గా ఆల్రెడీ ఎగ్జిస్టై ఉన్న దర్శకులందరనీ తలదన్నే చిత్రం చేస్తానంటూ పాడతాడని చెప్పుకొచ్చారు. అలాగే తాను వైజాగ్ లో ఉన్నప్పుడు రాఘవేంద్రరావు షూటింగ్ లో శ్రీదేవి ని చూసి జనాల మధ్యలో ఉండి చూసి భాధ పడ్డానని చెప్పుకొచ్చారు. ఇక సునీల్...తాను పన్నెండేళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మ చిత్రం ప్రేమకథ లో నటించటానికి సెలక్షన్స్ కోసం పాలకొల్లు దాకా వెళ్ళి రిజెక్టు అయి వచ్చానని, ఇప్పుడు అదే దర్శకుడు చేస్తున్న చిత్రంలో హీరో చేయటం ఆనందంగా ఉందని అన్నారు. ఇక ఈ పంక్షన్ కి నాగచైతన్య, నాగార్జున, కె రాఘవేంద్రరావు, శ్రీను వైట్ల, గుణశేఖర్,సుమంత్, రాణా, సురేష్ బాబు,కోట శ్రీనివాసరావు వంటి ఎందరో సెలబ్రిటీలు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.


Click it and Unblock the Notifications











