కలర్ ఫోటో: రియాక్ట్ అయిన సునీల్.. ఏమన్నారంటే!!
ఈ రోజు (ఫిబ్రవరి 28) సునీల్ పుట్టిన రోజు సందర్భంగా ''కలర్ ఫోటో'' సినిమా నుంచి ఆయన లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సునీల్ విలన్ గా నటిస్తున్నాడని, ఆయన పాత్ర పేరు రామరాజు అని తెలుపుతూ కొత్త పోస్టర్ విడుదల చేశారు.
అయితే తాజాగా ఆ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన సునీల్.. తన స్పందన తెలియజేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు. ''ఇప్పటివరకు నా కెరీర్ లో ఎంజాయ్ చేస్తూ చేసిన క్యారెక్టర్ రామరాజు. ఈ డిఫెరెంట్ లో నన్ను చూసి ఆడియన్స్ అంతా సర్‌ప్రైజ్ అవుతారు. నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన కలర్ ఫోటో చిత్ర యూనిట్‌కి కృతజ్ఞతలు'' అని పేర్కొన్నాడు సునీల్.

శ్రవణ్ కొంక సమర్పణలో అమృత ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని ఈ 'కలర్ ఫోటో' సినిమాను నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం 1995లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతోంది. యూట్యూబ్‌లో పాపులర్ అయిన సందీప్ రాజ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. యం.యం.కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. 'ఛాయ్ బిస్కెట్' ఛానెల్‌తో పాపులర్ అయిన సుహాస్ ఈ 'కలర్ ఫోటో' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











