రేడియో జాకీగా గాయత్రి టీనేజ్ గర్ల్ ప్రేమకథ

ఒక టీనేజ్ గాళ్ ప్రేమకథ ఇది అని దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందులో హీరోయిన్ ఓ రేడియో జాకీ అని, కథాకథనాలు హార్ట్ టచింగ్‌గానూ రోమాంటిక్ ఫీల్‌తోనూ ఉంటాయని ఆయన అన్నారు. కొత్త, పాత తారలు ఇందులో నటిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని సునీల్ కుమార్ రెడ్డి చెప్పారు.
తమ శ్రావ్య ఫిలింస్ సంస్థలో ఇది తొమ్మిదో సినిమా అని, టైటిల్ త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత యక్కల రవీంద్రబాబు చెప్పారు. సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. ప్రవీణ్ ఇమ్మడి స్వరాలందిస్తున్ారు. ఫిబ్రవరిలో పాటలను, చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రఘుబాబు, ఎల్బీ శ్రీరామ్, షఫీ, జీవా, వైభవ్ సూర్య, సోనీ చరిష్టా, అనిల్ కళ్యాణ్, ఎఫ్ఎం బాబాయ్, శశిధర్, రవి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా సాయి జేమ్స్, ఎడిటింగ్ శివ, పాటలు- శ్రేష్ఠ, ఆర్ట్ మౌళి. ఈ చిత్రాన్ని సుఖీభవ గ్రూప్ సమర్పిస్తోంది. డిజిక్వెస్ట్ బసిరెడ్డి, బి. బాపిరాజు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











