మైండ్ బ్లోయింగ్.. 2000 కోట్ల బడ్జెట్‌తో త్రివిక్రమ్ సినిమా.. సంచలన విషయం బయట పెట్టిన సునీల్!

Recommended Video

Trivikram Has A Rs 2,000 Crore Script, Says Star Comedian Sunil || Filmibeat Telugu

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాలని ప్రతి హీరో భావిస్తాడు. త్రివిక్రమ్ చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరగా, యువతకు నచ్చే అంశాలతో ఉంటాయి. త్రివిక్రమ్ రాసే పంచ్ డైలాగులకు విపరీతమైన క్రేజ్ ఉంది. స్టార్ హీరోల అభిమానులు కోరుకునే అంశాలని కూడా త్రివిక్రమ్ అందిస్తుంటారు. తాను స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ త్రివిక్రమ్ ఇంతవరకు మితిమీరిన బడ్జెట్ తో చిత్రాలు తెరకెక్కించింది లేదు. త్రివిక్రమ్ సన్నిహితుడు, ప్రముఖ నటుడు సునీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాన్ని ప్రకటించారు. త్రివిక్రమ్ గురించి సునీల్ చెప్పిన ఆ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

 దాదాపుగా అన్ని చిత్రాల్లో

దాదాపుగా అన్ని చిత్రాల్లో

దాదాపు త్రివిక్రమ్ తెరకెక్కించే అన్ని చిత్రాల్లో సునీల్ నటిస్తాడు. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం అటువంటిది. పలు సంధర్భాల్లో సునీల్ తనకు త్రివిక్రమ్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి వివరించాడు. ఒక రకంగా సునీల్ కమెడియన్ గా ఎదుగుదలకు త్రివిక్రమ్ రాసిన కామెడీ పంచ్ లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. సునీల్ తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. ఆ తర్వాత హీరోగా మరీనా సంగతి తెలిసిందే. ప్రస్తుతం మళ్ళీ సునీల్ హాస్యభరితమైన పాత్రల్లో నటిస్తున్నాడు.

2000 కోట్ల బడ్జెట్‌

2000 కోట్ల బడ్జెట్‌

తాజాగా సునీల్ ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ గురించి మతిపోగోట్టే విషయాన్ని వెల్లడించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద 2000 కోట్ల బడ్జెట్ అవసరమయ్యే అద్భుతమైన కథ సిద్ధంగా ఉందని తెలిపాడు. త్రివిక్రమ్ నాకు కొన్నెళ్ల క్రితం తాను రాసుకున్న కథ గురించి చేప్పారు. మతిపోగోట్టే కథ అది. త్రివిక్రమ్ ఆ కథ నాకు చెప్పిన సమయంలో అయితే 500 కోట్ల బడ్జెట్ లో పూర్తయ్యేది. ప్రస్తుతం అదే చిత్రాన్ని తెరకెక్కించాలంటే కనీసం 2000 కోట్లు అవసరం అని సునీల్ తెలిపాడు.

మొత్తం వెనక్కి వస్తుంది

మొత్తం వెనక్కి వస్తుంది

త్రివిక్రమ్ ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తే తప్పకుండా ఖర్చైన బడ్జెట్ మొత్తం వెనక్కు తీసుకుని వస్తుందని, ఆ కథలో అంత సత్తా ఉందని సునీల్ తెలిపాడు. త్రివిక్రమ్ పై సునీల్ నమ్మకం వ్యక్తం చేయడంలో తప్పు లేదు. కానీ వాస్తవాన్ని గమనిస్తే ఇంత వరకు ఏ ఇండియన్ సినిమాఅంత బడ్జెట్ లో తెరకెక్కలేదు. దంగల్, బాహుబలి 2 లాంటి చిత్రాల వసూళ్లే 2000 కోట్ల వద్ద ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్టే 2000 కోట్లు అంటే సాధారణమైన విషయం కాదు.

భవిష్యత్తులో

భవిష్యత్తులో

త్రివిక్రమ్ భవిష్యత్తులో ఈ కథని కార్యరూపం దాల్చే విధంగా ప్రయత్నాలు మొదలుపెడతాడేమో చూడాలి. ప్రస్తుతం ఇండియన్ చిత్రాలు 500 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కితేనే అంతా ఆశ్చర్యంగా చూస్తారు. 2000 కోట్ల బడ్జెట్ అవసరం అయ్యే త్రివిక్రమ్ రాసుకున్న ఆ కథ గురించి మాత్రం ఆసక్తి పెరుగుతోంది. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రాన్ని తెరక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X