త్రిష రెండు కోట్ల డిమాండ్ తో మిల్టన్ కి ఛాన్స్...!?
ఇటీవల హిందీలో హిట్ సినిమాగా పేరు తెచ్చుకున్న చిన్న బడ్జెట్ సినిమా 'తను వెడ్స్ మను' తెలుగులోకి రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. దేవి ప్రసాద్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ సన్నాహాలు జరుపుకుంటోంది. కమెడియన్ సునీల్ ఇందులో హీరోగా నటించనున్నాడు. కాగా, అతని పక్కన హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్నది మొదటి నుంచీ పెద్ద సస్పెన్స్ గా వుంది.
మొదట్లో త్రిషను ప్రయత్నించగా ఆమె సునీల్ పక్కన చేయడానికి 'నో' చెప్పిందని వార్తలొచ్చాయి. చెన్నై అందగత్తె త్రిష ఎవరితోనైనా నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటోందని సమాచారం. త్రిష తన రేంజ్ తగ్గిందని అనుకుంటున్నారా..? అని అడగకుండా చిన్న కండిషన్ పెట్టిందట. సునీల్‌తో నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదనీ, అయితే పారితోషికంగా రూ. 2 కోట్లిస్తే సిద్ధమేనని తెలియజేసిందట. దీంతో సదరు నిర్మాతకు కళ్లు బైర్లు కమ్మి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ్నుంచి జారుకున్నాడట. అన్నట్లు ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది ప్రధమార్థంలోగానీ త్రిష వివాహం చేసుకునే అవకాశం ఉన్నదని కోలీవుడ్ సినీవర్గాల భోగట్టా.
ఆ తర్వాత తాప్సీ పేరు వినిపించింది. ఆమె కూడా త్రిషలాగే 'సేమ్ డైలాగ్' వినిపించింది. దాంతో ఇప్పుడు తాజాగా, పార్వతీ మెల్టన్ పేరు వినిపిస్తోంది. ఈమధ్య కాలంలో సినిమాలేవీ లేక ఖాళీగా ఉంటున్న పార్వతిని, ఈ సినిమాలో బుక్ చేయాల్సిందిగా సునీల్ నిర్మాతలకు రికమెండ్ చేస్తున్నాడని తెలుస్తోంది. తన డేట్స్ అన్నీ 'ఫుల్ ఖాళీ'గా వున్నాయి కాబట్టి, ఆమె వెంటనే ఈ ఆఫర్ని అంగీకరించే అవకాశం వుంది. కథానాయిక ఎంపికైపోతే... పాపం... సునీల్ కి ఓ టెన్షన్ వదిలిపోతుంది.


Click it and Unblock the Notifications











