twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంక్రాంతి బరి నుండి ‘భీమవరం బుల్లోడు’ జంప్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో పోటీ పడుతూ....కామెడీ హీరో సునీల్ తన తాజా సినిమా 'భీమవరం బుల్లోడు' చిత్రంతో సంక్రాంతి బరిలో నిలవాలని ట్రై చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సునీల్ సంక్రాంతి బరి నుండి తప్పుకన్నట్లు తెలుస్తోంది. 'భీమవరం బుల్లోడు' చిత్రం జనవరి 24న విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

    సినిమా వివరాల్లోకి వెళితే...సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈచిత్రాన్ని 'కలిసుందాం..రా!, ప్రేమతో..రా!, రారాజు, బలాదూర్' వంటి సినిమాలను తెరకెక్కించిన ఉదయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 'వేయి అబద్దాలు' ఫేమ్ ఎస్తేర్ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు.

    అండ్ మాస్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 'పూలరంగడు' వంటి హిట్ చిత్రం తరువాత సునీల్ - అనూప్ రూబెన్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాగానూ.. 'తడాఖా' వంటి హిట్ చిత్రం తరువాత సునీల్ హీరోగా నటిస్తున్న చిత్రంగానూ 'భీమవరం బుల్లోడు' వార్తల్లో నిలుస్తోంది.

    తనికెళ్ల భరణి, జయప్రకాశ్‌రెడ్డి, షాయాజి షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, 'అదుర్స్' రఘు, 'సత్యం' రాజేశ్, శ్రీనివాసరెడ్డి, గౌతంరాజు,తాగుబోతు రమేశ్, సామ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: కవి కాళిదాస్, మాటలు: శ్రీధర్ సీపన, సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: సంతోష్ రాయ్, నిర్మాత: సురేశ్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఉదయశంకర్.

    English summary
    Sunil’s comedy entertainer Bhimavaram Bullodu was supposed to release during Sankranthi festival but sources say that this film is shifted to 3rd week of January due to Nenokkadine and Yevadu. Probably on January 24th, it might be hitting theatres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X