రామ్ గోపాల్ వర్మతో పోల్చద్దు అంటున్న సునీల్
'పోల్చకపోల్చక రామ్ గోపాల్ వర్మతో పోల్చావా' అని చిరాకుపడుతున్నాడు సునీల్. అయితే అది 'కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం: అప్పల్రాజు' చిత్రం కోసం. అందులో సునీల్ ..అమలాపురం నుంచి హైదరాబాద్ వచ్చి సినిమాని డైరక్ట్ చేసే పాత్రలో కనిపించనున్నాడు. ఎలాంటి అనుభవం లేని అతను సినిమా తీస్తానంటే అతను ప్రెండ్ కృష్ణుడు నువ్వేమన్నా రామ్ గోపాల్ వర్మవా..అని వెక్కిరిస్తాడు. అప్పుడు సునీల్ కి ఎక్కడో కాలి...ఇంత గొప్ప ఆలోచనలతో నిండి ఉన్న నన్ను రామ్ గోపాల్ వర్మతో పోల్చి అవమానం చేస్తావా అని రెచ్చిపోయి పాటందుకుంటాడు.
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కిరణ్‌కుమార్ కోనేరు నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయమై నిర్మాత మాట్లాడుతూ...సినిమాను అప్పల్రాజు చూసిన కోణమేమిటి? వాస్తవంలో సినిమా ఏమిటన్నది చిత్రంలో ప్రధానాంశం అన్నారు.స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో తనూరాయ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: కోటి, సమర్పణ: వందిత కోనేరు, సహ నిర్మాత: సుమన్‌వర్మ.


Click it and Unblock the Notifications











