‘పూల రంగడు’ ఔట్...సంతోషంగా లేని సునీల్!

By Bojja Kumar

కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ తాజా చిత్రం 'పూల రంగడు' సంక్రాంతికి విడుదల చేయాలని తొలుత నిర్ణయించినప్పటికీ....అది వీలు కావడం లేదని తాజాగా అందిన సమాచారం. సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాక పోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సంక్రాంతికి మహేష్ బాబు(బిజినెస్ మ్యాన్), వెంకటేష్(బాడీగార్డ్), రవితేజ(నిప్పు) లాంటి పెద్ద హీరోల సినిమాలు కూడా విడుదల అవుతుండటం కూడా ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి పక్కక తప్పుకోవడానికి మరో కారణంగా కనిపిస్తోంది. జనవరి చివరి వారం లేదా, ఫిబ్రవరి మొదటి వారంలో పూల రంగడు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సాధారణంగా ఏ హీరో అయినా పండగ సీజన్లలో ముఖ్యంగా సంక్రాంతి, దసర పండగలకు తమ సినిమాలు విడుదల చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. హీరోగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సునీల్ పూలరంగడు సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంపై సంతోషంగా లేడని అంటున్నారు.

వీరబద్రం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సునీల్ సరసన ఈషా చావ్లా నటిస్తోంది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితం అవుతోంది. కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్‌రావత్, రఘుబాబు, దేవ్‌గిల్, పృధ్వీ, సుధ, ప్రగతి, శ్రీలలిత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపన, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X