twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సీతా వెడ్స్ రాముడు'లో సునీల్

    By Srikanya
    |

    మాధవన్, కంగనా రౌనత్ కాంబినేషన్ లో రూపొందిన హిందీ చిత్రం 'తను వెడ్స్ మనూ' తెలుగులో రీమేక్ కి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంకి సునీల్ ని హీరోగా ఫైనలైజ్ చేసారు.ఈ చిత్రానికి సీతా వెడ్స్ రాముడు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తాజా సమాచారం. బాలీవుడ్ లో చిన్న బడ్జెట్ తో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఆడుతూ పాడుతూ,బ్లేడ్ బాబ్జీ,లీలా మహల్ వంటి చిత్రాలను డైరక్ట్ చేసిన దేవి ఫ్రసాద్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితం కానుంది.గతంలో ఇదే నిర్మాతలు అందాల రాముడు చిత్రం నిర్మించి కమిడెయిన్ గా ఉన్న సునీల్ ని హీరోగా చేసారు.ఇక ఈ చిత్రం హిందీలో ఉన్నట్లు కాక తెలుగు నేటివిటీకి తీసుకు వచ్చి మంచి కామిడీ చిత్రంగా హిట్టు కొట్టాలని స్క్రిప్టు పై గత కొద్ది రోజులు గా కసరత్తు చేస్తున్నారు.

    ప్రస్తుతం సునీల్ పూల రంగడు చిత్రం చేస్తున్నారు. అహనా పెళ్లంట చిత్రం డైరక్ట్ చేసిన వీరభద్రం ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు. అప్పలరాజు చిత్రం తర్వాత సునీల్ కమిటై చేస్తున్న చిత్రం ఇదే.మళయాళంలో దిలీప్ చేసిన ఓ చిత్రం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం.ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఆర్.ఆర్.మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే సీతా వెడ్స్ రాముడు సినిమా తెరకెక్కుతుంది.ఈ టైటిల్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. తాప్సీని హీరోయిన్ గా పరిశీలుస్తున్నారు. ఆమె కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Super Good Films which introduced Sunil as hero will be producing the Hindi Remake ‘Tanu weds Manu’ as ‘Sita weds Ramudu’ in Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X