చిరంజీవిగారే అసలు... మేం నకిలీ హీరోలం

By Srikanya

చిరంజీవిగారే అసలు. మేమంతా ఆయనకి నకళ్లం. నకళ్లెప్పటికీ అసలు కావు అంటున్నాడు సునీల్. త్వరలో 'పూలరంగడు'గా తెర మీదకు దూసుకు వస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే డాన్స్ ల్లో ఆయన శైలి చూపించినా చిరంజీవిని మరిపించలేమని చెప్పారు. ఇక పూలరంగడు లోనూ అదిరిపోయే డాన్స్ లు ఉంటాయని చెప్తూ... అందాలరాముడు, మర్యాదరామన్న సినిమాల్లో నేను చేసిన నృత్యాలకు మంచి పేరొచ్చింది. ఈ సినిమాలో వాటిని మించేలా ఉంటాయి. బాలు, భాను అనే ఇద్దరు కొత్త నృత్య దర్శకులు ఈ చిత్రానికి పనిచేశారు. ఆకట్టుకొనే నృత్యభంగిమలుంటాయి అని చెప్పుకొచ్చారు. అలాగే 'మర్యాదరామన్న'లో తలకిందులుగా ఓ భంగిమ వేశాను. వాటి కోసం దాదాపు పదిహేను రోజులపాటు ఇంట్లో కసరత్తు చేశా. ఈ సారి మాత్రం సమయం కేటాయించడం కుదర్లేదు. నా సాధన అంతా సెట్లోనే అన్నారు.

ఇక 'అందాలరాముడు', 'మర్యాదరామన్న' సినిమాల తరవాత నేనిక హాస్యనటుడిగా కనిపించనని ఏవేవో అనుకొన్నారు. కానీ అది నిజం కాదు. నా దగ్గరకి అలాంటి అవకాశాలొస్తే ఏ మాత్రం వదులుకోవడం లేదు. అయితే కాల్షీట్లు సర్దుబాటు కాలేక కొన్ని సినిమాలు వదులుకొన్నా. మహేష్‌బాబు 'దూకుడు'లో నటించాల్సింది. 'మీరుంటే వినోదం ఎక్కువగా ఆశిస్తారు. కొంచెం తగ్గినా.. ఒప్పుకోలేరు. అందుకే వేరేవారిని తీసుకొందాం' అని శ్రీనువైట్ల నాతో చెప్పారు. నా దగ్గరకి వచ్చే దర్శకులు కూడా నన్ను హీరోగానే ఊహించుకొంటున్నారు. మంచి పాత్రలొస్తే నటించడానికి నేనెప్పుడూ సిద్ధమే అని చెప్పారు. పూల రంగడు చిత్రాన్ని..అల్లరి నరేష్ తో అహనా పెళ్లంట డైరక్ట్ చేసిన వీరభద్రమ్ రూపొందించారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X