చిరు అన్నయ్యా..సారి
సారి..అన్నయ్యా..ఇలా చెప్తున్నందుకు...రామ్ చరణ్ నిన్ను దాటిపోతాడు...అంటూ సునీల్ మొన్న మగధీర ఆడియో పంక్షన్ లో చిరంజీవికి తో అని ఆనందపరిచాడు. ఆ విషయం అంతటా చర్చనీయాంశమైంది. సునీల్ గతంలో ఎప్పుడూ ఇంత ఎమోషనల్ గా మాట్లాడలేదని అందరూ అన్నారు. అలాగే సునీల్ తనకీ ఘరానామొగుడు చిత్రంలోని బంగారుకోడిపెట్ట పాటతో చాలా అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు. ఆ పాటని తాను సినీ పరిశ్రమకు రాకముందు అనేక స్టేజ్ షోలు ఇచ్చానని అన్నారు. అలాగే మగధీరలోనీ కోడిపెట్టపాట కూడా చాలా పేరు తెచ్చుకుంటుందని చెప్పుకొచ్చాడు. సునీల్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న అనే హాస్య ప్రధాన చిత్రంలో నటిస్తున్నాడు. రాయలసీమ ఫ్యాక్షన్, మర్యాదలు విభిన్నంగా చూపే ఈ చిత్రం కొద్ది రోజుల క్రిందటే మొదలైంది. సునీల్ ప్రక్కన సలోని నటించే అవకాశం ఉంది.
sunil chiranjeevi ram charan magadheera rajamouli saloni సునీల్ మగధీర ఆడియో పంక్షన్ ఎమోషనల్ బంగారుకోడిపెట్ట రాజమౌళి ఘరానామొగుడు మర్యాద రామన్న సలోని


Click it and Unblock the Notifications