మూడు నెలల్లో 15 కిలోల బరువు తగ్గడమంటే మాటలా? సునీల్ అది సాధించాడు. 105 కిలోల నుంచి 90 కిలోలకు తగ్గాడు. గతంలో లాగా అడ్డగోలుగా తినేయకుండా ఇప్పుడు సునీల్ ఉడికించిన కూరగాయలు, పళ్ళ రసాలు మాత్రమే తీసుకుంటున్నాడట. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో హీరోగా నటించే చాన్స్ దక్కిన సునీల్ అందుకోసం ఇష్టమైన తిండిని త్యాగం చేశాడు. "అందాల రాముడు" తర్వాత సునీల్ హీరోగా నటిస్తున్న సినిమా ఇదే. 2009 లో ఇప్పటివరకు సునీల్ కమెడియన్ గా నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. రాజమౌళి సునీల్ ను తిరుగులేని హీరోగా నిలబెట్టే అవకాశాలున్నాయి.