కేక పుట్టిస్తున్న సునీల్ ‘సిక్స్ ప్యాక్’
కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్ తన రేంజ్ పెంచుకోవడానికి తెగ కష్ట పడుతున్నాడు. బొద్దుగా కమెడియన్ లా ఉండే సునీల్ హీరో కావడం కోసం ఆ మధ్య చాలా కష్ట పడి సన్నబడ్డాడు. మర్యాద రామన్న సినిమాలో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశాడు కూడా. ఆ తర్వాత వచ్చిన అప్పల్రాజు సినిమా పెద్దగా ఆడక పోయినా...అందులో సునీల్ తన డాన్సింగ్ కెపాసిటీ ఏమిటో ప్రేక్షకులకు చూపించాడు. తాజాగా విడుదలకు సిద్ధం అవుతున్న 'పూల రంగడు' సినిమాలో యాక్షన్ పార్టులోనూ తాను అదరగొట్టగలనని నిరూపించుకోవడానికి సిద్ధం అయ్యాడు. ఈ సినిమా కోసం చాలా వర్కౌట్లు చేసి 'సిక్స్ ప్యాక్' బాడీని బిల్డ్ చేశాడు. పక్క ఫోటోలో చూస్తున్నవి అందులోని దృశ్యాలే....కేక పుట్టించే విధంగా ఉంది కదూ సునీల్ బాడీ. ఇలాంటి బాడీ ఏ ప్రభాసో, అల్లు అర్జునో పెంచితే విశేషం కాదుకానీ, సునీల్ అంటే ఆశ్చర్యమే మరి.
సునీల్, ఇషా చావ్లా జంటగా నటిస్తున్న పూలరంగడు చిత్రాన్ని...ఆర్ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై 'అహనా పెళ్లంట' డైరెక్టర్ వీర భద్రం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రేమ కావాలి చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన అనూప్ రుబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











