డబ్బు, జ్ఞానం ఇచ్చి దారి చూపాడు: త్రివిక్రమ్ గురించి సునీల్ ఎమోషనల్ స్పీచ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' మూవీ ఆడియో వేడుక హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ తన ఫ్రెండ్, చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ గురించి ఎమోషనల్‌‌గా రియాక్ట్ అయ్యారు. అనంతరం ఎన్టీఆర్ గురించి చెబుతూ... అతడి గొప్ప మనసు గురించి వెల్లడించారు.

చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. మన జీవితంలో అమ్మా నాన్న మనల్ని ఓపికగా పెంచి ఇది మంచి చెడు అని చెబుతారు. తర్వాత గురువులు కొంత విజ్ఞానం నేర్పుతారు. తర్వాత అన్నయ్యలు, మనకంటే పెద్దోళ్లు డబ్బులు ఇచ్చి మనల్ని బాగా చూస్తారు. నేను హైదరాద్ వచ్చిన తర్వాత ఆ మూడు పోర్షన్లు తీసుకున్న వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. నాకు డబ్బులు ఇచ్చి, విజ్ఞానం ఇచ్చి నాకు రూట్ చూపించాడు. జీవితంలో మంచి ఫ్రెండును సెలక్ట్ చేసుకుంటే చాలు లైఫ్ ధైర్యంగా ఉంటుంది అనడానికి ఎగ్జాంపుల్ త్రివిక్రమ్.... అని సునీల్ చెప్పుకొచ్చారు.

Sunil speech at Aravinda Sametha Pre Release event

ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. తనకు ఆనందం ఉంటుంది. మన సక్సెస్ మనతో పాటు ఉన్న మన ఫ్రెండ్స్ కు చాలా ఆనందం కలిగిస్తుంది. అది మీరు కూడా లైఫ్‌లో చూసే ఉంటారు. నాకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ఎన్ని వేషాలు వేసినా ఫైనల్ గా నాకు మంచి వేషం రాయడానికి తను ఉన్నాడనే ధైర్యం....ఎప్పుడూ ఉంటుందని సునీల్ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ..... మనకు చాలా మంది సక్సెస్‌ఫుల్ పీపుల్ కనిపిస్తారు, పెద్దోళ్లు కనిపిస్తారు. కానీ మనసుతో దగ్గరగా తీసుకునే వారు చాలా తక్కువగా ఉంటారు. ఈ విషయం నేను తారక్ భయ్యా గురించి చెబుతున్నాను. ఆయన షూట్‌కు లేచి నడిచి వెళుతూ... ఆయన కుర్చి ఇంకొకరికి ఇచ్చి కూర్చోమని చెప్పి వారి కంఫర్ట్ చూసే మంచి మనసు ఉన్న వ్యక్తి.... అన్నారు.

ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డబ్బింగ్ చెబుతున్నపుడు కొంచెం కొంచెం చూశాను. అదిరిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో జగపతి బాబుగారిని చూసి ఇంటికెళ్లి పడుకున్నాక మళ్లీ కలలోకి వచ్చి భయపెడతారు.. ఆయన పాత్ర మనపై అంత ఎఫెక్టివ్‌గా ఉంటుందని సునీల్ తెలిపారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాయలసీమ కుర్రాడు వీర రాఘవ పాత్రలో కనిపించబోతున్నారు. అరవింద పాత్రలో పూజా హెగ్డే నటిస్తోంది. ప్రేమ కథ చుట్టూ జరిగే ఫ్యాక్షన్ సినిమాలా ఇది ఉంటుందని తెలుస్తోంది.

'అరవింద్ సమేత' చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబుతో పాటు నాగబాబులు కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X