ఎంత ఫ్రెండ్ అయినా పబ్లిగ్గా ఇలానా? త్రివిక్రమ్ గురించి సునీల్ ఓవర్ స్పీచ్!
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' ఫస్ట్ వీకెండ్ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన నేపథ్యంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో పాటు చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ... ఈ సినిమా బెంజ్ కారు లాంటిదని, దానికి ట్రాక్టర్ టైర్ వేస్తే బావుండదు కాబట్టి తన కామెడీ తగ్గించారని, దాని వల్లే సినిమా అంత నీట్‌గా వచ్చిందని తెలిపారు. తన కామెడీ తక్కువైందని అంటున్న వారికి నేను చెప్పే సమాధానం ఇదే అని సునీల్ స్పష్టం చేశారు. దీని తర్వాత సునీల్ తన స్నేహితుడు త్రివిక్రమ్ గురించి చేసిన కామెంట్స్ విని అంతా బిత్తరపోయారు. కొందరికి ఇది ఓవర్ అనిపించినా... చాలా మంది ఎంజాయ్ చేశారు.

వంట చేసి, బట్టలుతకేవాడిని...
ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు నీలాంబరి. నాకు ఆ పేరు ఎందుకు పెట్టాడంటే.... ''త్రివిక్రమ్‌తో కలిసి నేను రూములో ఉండగా వంట చేసేవాడిని. ఇల్లు తుడవటం, బట్టలుతకడం, ఇస్త్రీ చేయడం, బాబు రెడీ అయ్యే సమయానికి సూట్ కేసు పక్కన పెట్టేవాడిని. సెంటు సీసా ఒకటే ఉండేది... దాంతోనే ఇద్దరం అడ్జెస్ట్ అయ్యేవారం.'' అంటూ సునీల్ అందరినీ నవ్వించారు.

నా ఆత్మని తన పెన్నులో ఇంకులా పోసి
పెనివిటి పాట ఐడియా ఎలా వచ్చిందంటే.. ఓసారి త్రివిక్రమ్ ఫస్ట్ టైమ్ రూములో నుండి బయల్దేరి ఒక చోట రాయడానికి చెన్నై వెళ్లిపోయారు. ఫోన్ లేదు, వారం రోజులు అయిపోయింది. రూములో నా వద్ద డబ్బులన్నీ అయిపోయాయి. అసలే చెన్నై... తమిళం రాదు, ఎక్కడున్నాడో? వేళకు తిన్నాడా? వేళకు పడుకున్నాడా? ఆరోగ్యం ఎలా ఉందో..? కనీసం రొంప వచ్చినా చూసుకునే వారు లేరు? ఇలా వచ్చే వరకు ఎదురు చూశాను. అందుకే దేవుడు నా ఆత్మని తన పెన్నులో ఇంకులా చేసి ఈ సిచ్యువేషన్ రాయడానికి అవకాశం కల్పించాడు.... అంటూ సునీల్ వ్యాఖ్యానించారు.

చాలా త్యాగం చేశాను
ఒక మహా వ్యక్తిగా తనను ప్రూవ్ చేయడానికి నేను ఏమీ తెలియని అమాయకుడిలాగా ఎంత వదలు కోవాల్సి వచ్చిందో ఇదంతా చెప్పాను.... అని వ్యాఖ్యానించి సునీల్ ఇపుడు నిజం మాట్లాడుకుందాం అంటూ అసలు మ్యాటర్లోకి వెళ్లాడు.
తారక్ భయ్యాకు థాంక్స్
నాలో ఎప్పుడూ కమెడియన్‌నే కాకుండా, నాలో చాలా ఇంటెన్సిటీ ఉంది అని నమ్మిన తాకర్ భయ్యాకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నాను. ఆయన బలంగా నమ్మక పోతే నేను కూడా ఈ సినిమాలో కామెడీ చేయాల్సి వచ్చేదేమో. ఈ సినిమా ద్వారా మంచి ఆర్టిస్టుగా ప్రూవ్ చేసుకున్నాను... అని సునీల్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











