సినిమాల్లోనూ కనిపించని రాజకీయాలు ఉంటాయి...సునీల్
సినిమాల్లోనూ కనిపించని రాజకీయాలు ఉంటాయని భాగ్యనగరంలో అడుగుపెట్టాకే తెలిసింది...అంటున్నారు సునీల్. అయితే అది ఆయన పర్శనల్ లైఫ్ గురించి చెప్పటం లేదు. ఆయన తాజా చిత్రం 'కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల్రాజు' గురించి చెబుతూ ఇలా అన్నారు. అందులో అప్పలరాజు పాత్ర..సినిమా అంటే...అరవై సన్నివేశాలు, ఆరు పాటలూ, నాలుగు ఫైట్లూ - అమలాపురంలో ఉన్నప్పుడు అప్పల్రాజు అచ్చం ఇలాగే ఆలోచించేవాడు. పరమ పవిత్రంగా ఓ సినిమా తీయాలి అనుకొన్న అప్పల్రాజు ఆలోచనల్లో దూరి ఒకొక్కరూ ఒక్కో మార్పు చేశారు. అలావాళ్లు చెప్పిన మార్పులన్నీ చేసుకొంటూపోతే చివరాఖరికి ఎలాంటి చిత్రం తయారైంది? ఆ సినిమా తీయడానికి అప్పల్రాజు ఎన్ని అగచాట్లు పడ్డాడో అదే మా కథ అంటున్నాడు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో స్వాతి, సాక్షి, తనూరాయ్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. అలాగే నిర్మాత కోనేరు కిరణ్ కుమార్ మాట్లాడుతూ...ఈ రంగుల లోకంలో మనకు తెలియని మరో కోణాన్ని వర్మ చక్కగా ఆవిష్కరించారు. ఇందులో కనిపించే ప్రతి పాత్ర సినిమా గురించే మాట్లాడుతుంది. ఎన్నో ఆశయాలతో ఫిల్మ్‌నగర్‌లో అడుగుపెట్టిన అప్పల్రాజు ఓ సినిమా తీయడానికిపడిన అగచాట్లు చూస్తే నవ్వొస్తుంది. జనవరి చివరి వారంలో సినిమాని విడుదల చేస్తామన్నారు. సంగీతం: కోటి.


Click it and Unblock the Notifications











