మర్యాద రామన్నలో ఆ సీన్ రాజమౌళికి నేను చెబితే...సునీల్
మర్యాద రామన్న చిత్రం చూసిన వారికి అందులో ఉన్న కొబ్బరి బొండాం సీన్ మర్చిపోవటం కష్టమే. సునీల్..స్ట్రా వద్దని కొన్న కొబ్బరిబొండాంని రైలు కిటికీ అవతల వైపు నుంచి లోపలకి తీసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ సన్నివేశానికి ప్రేరణ ఎక్కడిది? అని మీడియా వారు అడిగితే సునీల్ ఆ విషయం వివరిస్తూ...
మా అమ్మకు రైల్వే స్టేషన్‌లో ఎదురైన అనుభవం అది. మా బంధువుని ఆహ్వానించడానికి మా అమ్మ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కి వెళ్లింది. అక్కడో ప్రయాణికుణ్ని గమనించింది. 'స్ట్రా నాకొద్దయ్య' అనే మాట అమ్మకి వినిపించిందట. వెనక్కి తిరిగి చూస్తే...ఆయన కిటికీలోంచే కొబ్బరి బొండాం అందుకున్నాడు. అమ్మ ఇంటికొచ్చి 'అతగాడు కొబ్బరి బొండాం ఎలా తాగాడంటావ్..' అని నన్ను అడిగింది. అది నేను రాజమౌళికి చెప్పాను. ఆ సంఘటననే అంత అందంగా చూపించారు రాజమౌళి అన్నారు. అదీ సంగతి.
మర్యాద రామన్న సునీల్ సలోని రాజమౌళి కీరవాణి sunil rajamouli saloni nagineedu rayalaseema andhala ramudu


Click it and Unblock the Notifications