For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  త్రివిక్రమ్ నేను, డొక్కు స్కూటర్‌పై..., అవమానాలు

  By Srikanya
  |

  హైదరాబాద్ : త్రివిక్రమ్ కు, సునీల్ ఉన్న స్నేహం గురించి తెలియంది కాదు. వీళ్లిద్దరూ కెరీర్ ప్రారంభం నుంచీ ఇప్పటివరకూ ఏ స్ధాయికి వెళ్లినా స్నేహంగానే ఉంటున్నారు. ముఖ్యంగా సునీల్ మాత్రం త్రివిక్రమ్ గురించి చెప్తూనే ఉంటాడు. ఆఖరికి తన సినిమా ప్రమేషన్ లో సైతం. ఇప్పుడు మరోసారి సునీల్ తో తన జర్నీ గుర్తుచేసుకున్నాడు.

  సునీల్ మాట్లాడుతూ...త్రివిక్రమ్ నేను, ఇద్దరం డొక్కు స్కూటర్‌పై వెళ్లేవాళ్లం. అప్పట్లో కష్టమనిపించేది. కాని ఇప్పుడు ఖరీదైన కార్లలో తిరుగుతున్నా ఆ తృప్తి దొరకడం లేదు అన్నారు.

  సునిల్ హీరోగా, ఈ నెల 19న రిలీజ్ కు సిద్దం అయిన సినిమా కృష్ణాష్టమి. ఈ సినిమా మంచి వినోదం అందిస్తుందంటున్న సునిల్, చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ...... తన జీవిత ప్రయాణం గురించి కూడా చెప్పుకొచ్చాడు.

  స్లైడ్ షోలో ఆయనేం అన్నారో చూడండి.

  అవమానులు ఎదుర్కొన్నా..

  అవమానులు ఎదుర్కొన్నా..

  బస్సు టికెట్టుకుడా డబ్బుల్లేక చాలా దూరం కాలినడకనే తిరిగేవాడని. చాలా అవమానాలు ఎదుర్కోని ఇలా ప్రేక్షకులకు దగ్గరయ్యాను.

  బొద్దు నుంచి సిక్స్ ప్యాక్ కు..

  బొద్దు నుంచి సిక్స్ ప్యాక్ కు..

  నేను హీరో గా మారడం వెనుక చాలా కృషి వుంది. బొద్దుగా ఉండే నేను సిక్స్‌ ప్యాక్‌తో కనిపించడం సుమారు సంవత్సరం శ్రమ ఉంది. అలా అప్పుడు కష్టపడినందుకు ఇప్పుడు ఫలితం దక్కుతోంది.

  త్రివిక్రమ్ నేర్పాడు

  త్రివిక్రమ్ నేర్పాడు

  నా బాడీలాంగ్వేజ్‌కు తగ్గట్టు పాత్రలు సృష్టించి, నాకంటూ ఓ డైలాగ్‌ డెలివరీతో గుర్తింపునిచ్చాడు. ‘వంద చేపలు ఇవ్వడం కంటే ఓ చేప పట్టడం నేర్పు' అనేది నాకు త్రివిక్రమే నేర్పించాడు‌.

  అందుకే గ్యాప్

  అందుకే గ్యాప్

  ఆ మధ్య వరుసగా సినిమాలు చేసి, ఒక్కసారిగా గ్యాప్ తీసుకున్నాను. దానికి కారణం పెద్దది కాదు, కేవలం స్టోరిలు నచ్చకపోవడం వల్లనే.

  చిన్ని ఆపరేషనే..

  చిన్ని ఆపరేషనే..

  ఈ మధ్యనాకు కాలికి సంబందించి చిన్న ఆపరేషన్ జరిగింది. దాంతో సుమారు రెండు నెలలు ఇంట్లోనే గడపాల్సి వచ్చింది. నిజానికి ఇలా జరగడం ఫ్యామిలితో గడపడం కోసమే అన్నట్టు అనిపిస్తుంటుంది..

  తిట్టుకున్నారు

  తిట్టుకున్నారు

  భీమవరం బుల్లోడు తర్వత చాలా మంది వచ్చి కథలు చెప్పారు. నాకు ఎందుకో నచ్చలేదు, దానికి వారు వీడికి కథలు ఓ పట్టానా నచ్చవు..అని తిట్టుకుంటూ వెళ్లిన సందర్బాలు బోలెడు.

  ఈ సినిమా గురుంచి

  ఈ సినిమా గురుంచి

  ఈ కథ ఓ పెద్ద హీరోకోసం తయారు చేసుకున్నది, కానీ అది కుదరక పోవడంతో నన్ను చెయ్యమన్నారు. కథ నచ్చడంతో ఓకే చెప్పేసాను.

  వాసు వర్మ...

  వాసు వర్మ...

  ఆర్య నుండీ నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, తనతో పని చెయ్యడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నా నమ్మకం.

  మళ్లీ రాదేమో

  మళ్లీ రాదేమో

  కథ వినగానే నచ్చింది. కృష్ణాష్టమికి, హీరోకీ సంబంధం ఉంటుంది. అదేంటన్నది తెరపై చూడాలి. నా కెరీర్‌లో ఇలాంటి భారీ సినిమా మళ్లీ రాదేమో?

  ఆపరేషన్ వల్ల...

  ఆపరేషన్ వల్ల...

  ఇందులోనూ నా డాన్స్ స్పెషల్ గానే ఉంటుందండి. కాలికి శస్త్రచికిత్స జరగడం వల్ల ఫ్లోర్‌ స్టెప్పులు పెద్దగా వేయలేకపోయాను. కానీ ఈ సినిమాలో వేసిన స్టెప్స్ చూసినోళ్లంతా‘భలే చేశావ్‌' అంటున్నారు.

  మూడు సెకన్ల కోసమే...

  మూడు సెకన్ల కోసమే...

  మూడు సెకన్లలో నా సిక్స్‌ ప్యాక్‌ బాడీ చూపించా. ఆ చిన్న షాట్‌ కోసం మూడు నెలలు కష్టపడ్డా. సిక్స్‌ ప్యాక్‌ చేస్తుంటే మొహంలో తేడా వచ్చేస్తోంది. బుగ్గలు లాగేస్తున్నాయి. అందుకే సిక్స్‌ ప్యాక్‌ ఎపిసోడ్‌ సినిమా అంతా పూర్తయ్యాక ప్లాన్‌ చేశాం. ఆ షాట్‌ కోసం మళ్లీ జిమ్‌కెళ్లి కసరత్తులు చేయాల్సొచ్చింది.

  మెప్పించాలనే...

  మెప్పించాలనే...

  కమిడియన్ గా అయితే పది నిమిషాలు కనిపిస్తా, దానికి నేను ఎలా వున్నా పరవలేదు, కాని హీరోగా అంటే రెండున్నర గంటలూ కనిపిస్తా. అలాంటప్పుడు అందరినీ మెప్పించాలి కదా? అందుకే ఈ సిక్స్‌ ప్యాక్‌.

  మా అమ్మ వల్లే

  మా అమ్మ వల్లే

  నా సిక్స్ ప్యాక్ గురించి, ‘సిక్స్‌ ప్యాక్‌లెందుకు? ఇదివరకు హాస్యనటులెవరైనా ఇలా బాడీలు పెంచారా?' అని నాతోనే చాలామంది అన్నారు. ఇదే విషయం మా మా అమ్మకు చెప్పా. వెంటనే మా అమ్మ ‘ఇది వరకు ఎవరూ లేకపోవొచ్చు. రాబోతున్నవారికి నువ్వే ఆదర్శం గా వుండాలి కదా?' అని అంది. ఆ మాటే నాలో స్ఫూర్తి నింపింది.

  కష్టమే...

  కష్టమే...

  ‘వీడు నవ్విస్తాడేమో' అని అనుకోవడం లేదు. ‘వీడేం నవ్విస్తాడో చూడలి' అనుకొని థియేటర్లకు వస్తున్నారు. ఈలాంటి సమయంలో నవ్వించడం కష్టమే.

  ఒత్తిడి తట్టుకోలేకపోయా

  ఒత్తిడి తట్టుకోలేకపోయా

  హాస్యనటుడిగా ఉన్నప్పుడు ఒత్తిడికి గురయ్యేవాణ్ని. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా మూడు షిఫ్టుల్లో పని. ఒకేరోజు బెంగళూరు, చెన్నై హైదరాబాద్‌ ఇలా మూడుచోట్ల చిత్రీకరణలో పాల్గొన్న సందర్భాలున్నాయి. కొన్ని రోజులపాటు నా పడక బస్సులు, విమానాల్లోనే. ఆ ఒత్తిడి తట్టుకోలేకపోయా. అదే లేకపోతే ఇంకా బాగా నవ్వించేవాడ్నేమో?

  నాదే

  నాదే

  ఇదివరకు నేను కమిడియన్ గా నటింస్తున్నప్పుడు సీన్ బాగా వస్తే సరిపోతుందనుకొనేవాణ్ని. కానీ ఇప్పుడు హీరోగా ప్రతి సీనూ నాదే అనుకొంటున్నా.

  ఆల్వేస్ రెడీ...

  ఆల్వేస్ రెడీ...

  ‘అందాలరాముడు', ‘మర్యాద రామన్న', ‘పూలరంగడు', ‘భీమవరం బుల్లోడు'సినిమాలు నన్ను హీరోగా నిలబెట్టాయి. అందుకే కొత్త కొత్త సినిమాలు మెదలు పెట్టాడానికి ఎప్పుడు సిద్దంగానే వుంటాను.

  English summary
  It is well known fact that Sunil and Trivikram Srinivas are best buddies in Tollywood.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X