చిరంజీవే టార్గెట్‌గా కమెడియన్ మూమెంట్!
కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన వ్యక్తి సునీల్. తొలుత కామెడీ క్యారెక్టర్లతో కెరీర్ ప్రారంభించిన సునీల్....మెల్లి మెల్లిగా హీరోయి స్థాయికి ఎదిగాడు. తనపై ఉన్న కామెడియన్ ముద్ర పోగొట్టు కోవడానికి తన తాజా సినిమా 'పూల రంగడు' చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీ కూడా బిల్డ్ చేశాడు. వీర భద్రం చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్ సరసన ఇషా చావ్లా నటిస్తోంది. ఫిబ్రవరిలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆ విషయం పక్కన పెడితే...సునీల్ గురించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. పెద్ద హీరో కావాలని కలలు కంటున్న సునీల్ మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్‌గా పెట్టుకున్నాడట. చిరంజీవి తరహాలోనే కెరీర్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. చిరంజీవి కూడా తొలుత చిన్న చిన్న పాత్రలు చేసి మెగాస్టార్ స్థాయికి ఎదిగిన వాడే. తాను కూడా కింది నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు. అదే ఊపుతో మెగాస్టార్ లెవల్ పై కన్నేశాడు. ఇందు కోసం కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సునీల్. కామెడీ పండించడంలో, డాన్స్ స్టెప్పులు ఇరగదీయడంలో ఇప్పటికే అందరి నుంచి ప్రసంశలు అందుకున్న సునీల్ ఇకపై కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాడట.
తన వద్దకు కామెడీ కథలు వినిపించడానికి వస్తున్న వారితో తనకు అలాంటి సినిమాలు చేయడం ఇష్టం లేదని, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు లాంటి కథలు, లేదా ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా కమర్షియల్ కథలు ఉంటే చెప్పమని అడుగుతున్నాడట. మరి మెగాస్టార్ స్థాయిని తన లక్ష్యంగా పెట్టుకున్న సునీల్ లక్ష్యం ఎప్పుడు నెర వేరుతుందో...?


Click it and Unblock the Notifications











