ఇషా కోసం ‘పూలరంగడు’గా మారనున్న సునిల్
హీరోయిన్ ఇషా చావ్లా కోసం నటుడు సునీల్ పూల రంగడుగా మారబోతున్నాడు. అర్థం కాలేదా? అబ్బా అదేనండీ...సునీల్-ఇషా చావ్లా జంటగా వీరభద్రం చౌదరి దర్శకత్వంలో రూపొంద బోతున్న సినిమాకు 'పూల రంగడు" అనే టైటిల్‌ను ఖరారు చేశారు.త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల బోతోంది. అప్పల్రాజు ప్లాపు తర్వాత మళ్లీ నిలదొక్కుకునేందుకు కామెడీ ప్రధానమైన పాత్రతో సునీల్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
'ప్రేమ కావాలి" సినిమా ఫేం ఇషా చావ్లా ఇప్పటికే తన అందంతో ఆకట్టుకున్నప్పటికీ...అవకాశాలు రావడం లేదు. ఎట్టకేలకు సునీల్ సరసన రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది. ఇక దర్శకుడు వీరభద్రం ఇప్పటికే అల్లరి నరేష్ తో 'అహనా పెళ్లంట"తీసి మంచి ఊపు మీద ఉన్నాడు. సునీల్ సినిమా ద్వారా ఇండస్ట్రీలో పాతుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











