స్టార్ హీరో స్థానంలో సునీల్, దిల్ రాజు ప్లాన్ (ఫోటోలు)
హైదరాబాద్: వాస్తవానికి ఆ సినిమా టాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరోతో ప్లాన్ చేసారు. అద్భుతమైన కథ. కానీ కొన్ని కారణాల వల్ల ఆ హీరోతో చేయడం వీలు కాలేదు. దీంతో నిర్మాత దిల్ రాజు సునీల్‌ను హీరోగా ఎంపిక చేసుకున్నాడు. సునీల్ హీరోగా వాసు వర్మ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న సదరు చిత్రం బుధవారం సంస్థ కార్యాలయంలో ప్రారంభోత్సవం జరుపుకుంది.
దేవుడి చిత్రపటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిరమాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ ఇవ్వగా, కీరవాణి కెమెరా స్విచాన్ చేసారు. అల్లు అరవింద్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ....'ఈ సంస్థలో ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసాను. ఇపుడు ఇదే సంస్థలో హీరోగా చేస్తున్నాను. ఓ పెద్ద హీరో కోసం రాసిన కథను నాతో తీస్తున్నారు' స్లైడ్ షోలో మరిన్ని వివరాలు ఫోటోలు...

సునీల్, దిల్ రాజు
తనను నమ్మి ఒక పెద్ద హీరోతో చేయాల్సిన సినిమాను తనతో చేస్తున్న దిల్ రాజుకు సునీల్ థాంక్స్ చెప్పారు.

కథారచయిత కోన వెంకట్ మాట్లాడుతూ
దిల్ రాజు బేనర్లో సినిమా చేయడం అనేది పెద్ద ఎచీవ్ మెంట్. ఓ మంచి కథ హీరో, నిర్మాతను వెతుక్కుంటుంది. అలా ఈ కథ మమ్మల్నందర్నీ కలిపింది. నేనిష్టపడే తరహా వినోదం, దిల్ రాజుగారి చిత్రాల్లో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ అన్నీ ఉన్న కథ ఇది. సునిల్ కెరీర్ లోనే గొప్ప చిత్రంగా నిలిచిపోతుందన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ...
గోపిచంద్ మలినేని, కోన కలిసి ఓ కథ రాసుకున్నారు. ఆ కథను మా సంస్థలో తీయాలనుకున్నాం. కానీ, గోపి వేరే ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ మేం కోరిన మీదట ఈ కథ మాకిచ్చేశారని తెలిపారు.

వాసు వర్మ గురించి...
వాసు వర్మ గురించి దిల్ రాజు మాట్లాడుతూ...మా సంస్థలో ఇప్పటివరకూ వచ్చిన అన్ని సక్సెస్ ఫుల్ చిత్రాల్లో వాసూ వర్మకు భాగస్వామ్యం ఉంది. తన దర్శకత్వంలో వచ్చిన 'జోష్' ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా...చాలా ప్రతిభ గలవాడు అని తెలిపారు.

విడుదల ఎప్పుడంటే?
2015 ఫిబ్రవరిలో ఈచిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు దిల్ రాజు తెలిపారు.

కొత్త సంగీత దర్శకుడు
ఈ చిత్రం ద్వారా దినేష్ అనే కొత్త సంగీత దర్శకుడిని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











