సునీల్ కొత్త చిత్రం ' ఫ్రెండ్', డైరక్టరు ఎవరంటే...

By Srikanya

హైదరాబాద్ : సునీల్ మరో కొత్త చిత్రం కమిటయ్యినట్లు సమాచారం. బిందాస్,రగడ చిత్రాల దర్శకుడు వీరూపోట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి ' ఫ్రెండ్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.

ప్రస్తుతం సునీల్...భీమవరం బుల్లోడు టైటిల్ తో చిత్రం చేస్తున్నాడు. కలిసుందాం రా ఫేమ్ ఉదయ్ శంకర్ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందుతోంది. డి.సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది. అలాగే సునీల్ రచయిత గోపీ మోహన్ దర్శకత్వంలోనూ మరో చిత్రం కమిటయ్యారు.

ఇక వీరూపోట్ల విషయానికి వస్తే...మంచు మనోజ్ హీరోగా దూసుకెళ్తా అనే చిత్రం రూపొందిస్తున్నారు. కామెడీ,యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆ చిత్రం రూపొందనుంది. అందాలరాక్షసి ఫేమ్ లావణ్యం హీరోయిన్ గా చేస్తోంది. మంచు మనోజ్ తమ సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X