ఎవరేమనుకున్నా నేను సినిమా చేస్తాను-హిట్ కొడతాను...
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది కమెడీయన్లకు సునీల్ అంటే అసలు పడటంలేదట. సునీల్ ఎదురుగా కాకపోయినా, అతని వెనకాల మాత్రం కొంతమంది కమెడీయన్లు పిచ్చిపిచ్చిగా కుళ్ళు జోకులు వేసుకుని తెగ నవ్వేస్తున్నారట. దీనికి కారణం వరుసగా అతను హీరోగా సినిమాలు కమిట్ అవ్వడమేనని తెలుస్తోంది. తమతోటి కమెడీయన్ హీరోగా పైపైకి ఎదగడం టాలీవుడ్ లోని కొంతమంది కమెడీయన్లకు కంటగింపుగా ఉందట. అది కూడా పేరున్న దర్శకులతో సునీల్ సినిమాలు చేయడం వీళ్ళను మరింత కుళ్ళుకునేలా చేస్తోందని వినికిడి.
ఈ విషయాలన్నీ సునీల్ వరకూ వెళ్ళినా అతను మాత్రం ఇవేం పట్టించుకోవడం లేదట. ఎంతమంది నా వెనకాల కుళ్ళుకుంటే ఏంటీ? నేను నటించే 'కథ, స్ర్కీన్ ప్లే దర్శకత్వం: అప్పల్రాజు" హిట్ అయితే చాలు..వరుసగా హీరోగా మరిన్ని సినిమాలు చేసేస్తా అనుకుంటున్నాడట సునీల్.
సునీల్ రామ్ గోపాల్ వర్మ అప్పల్రారాజు మర్యాద రామన్న రాజమౌళి sunil ram gopal varma appalaraju maryada ramanna rajamouli


Click it and Unblock the Notifications