ఆ చిత్రానికి సునీల్ వాయిస్ ఓవర్
ఇప్పుడు ప్రతీ తెలుగు సినిమాకీ ఎవరో ఒక హీరో వాయిస్ ఓవర్ చెప్పాల్సిందే. జల్సా కి మహేష్‌బాబు ఈ ట్రెండ్ కి శ్రీకాం చుట్టారు. ఆ తర్వాత రవితేజ, జగపతిబాబు లాంటి ప్రముఖ నటులు, మరికొంత మంది దర్శకులు కొన్ని చిత్రాలకు వాయిస్ ఓవర్ చెప్పిన విషయం విదితమే. తాజాగా సునీల్ కూడా 'నువ్విలా' చిత్రానికి వాయిస్ ఓవర్‌ను అందించారు. ఉషాకిరణ్ మూవీస్ రూపొందిస్తున్న చిత్రం 'నువ్విలా'. రవిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ "సునీల్ వాయిస్ పెక్యూలియర్‌గా ఉంటుంది. అదే ఈ చిత్రానికి ఉపయోగించుకోవటానికి ప్రధాన కారణం. చిత్ర కథ ప్రాంభంలోనూ, పాత్రలను పరిచయం చేసే సందర్భంలోనూ, మరికొన్ని సన్నివేశాల దగ్గరనూ సునీల్ వాయిస్ అలరిస్తుంది. సునీల్ మాటలోని యాస, విరుపు భిన్నంగా ఉంటుంది. అందుకనే ఆయన గళాన్ని వినియోగించుకున్నాం'' అని తెలిపారు. మయూరి ఆడియో ద్వారా పాటలు విడుదలయ్యాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలోని సింఫనీలో రికార్డ్ చేశారు. మూడు జంటల చుట్టూ నడిచే వినోదాత్మకమైన ప్రేమకథా చిత్రమిది. ఈ నెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'నువ్విలా' చిత్రానికి మాటలు: రవిబాబు, సంగీతం: శేఖర్‌చంద్ర, పాటలు: భాస్కరభట్ల, కెమెరా: ఎన్.సుధాకర్‌రెడ్డి, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, కళ: నారాయణరెడ్డి, స్క్రీన్‌ప్లే: సత్యానంద్, దర్శకత్వం: రవిబాబు, నిర్మాత: రామోజీరావు


Click it and Unblock the Notifications











