రేడియా జాకీ పై మనస్సు పడ్డ సునీల్
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు ఆనందోత్సాహాలను పంచడంలో ఎఫ్‌ఎం రేడియోలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయన్నారు. ప్రయాణంలో అలసట చెందినపుడు వాహనంలో ఎఫ్‌ఎం వింటే ఉపశమనం కలగడంతో పాటు ఒత్తిడి తగ్గుతుందన్నారు. సంస్థ ప్రాంతీయ ప్రోగ్రామింగ్ హెడ్ రేవతి మాట్లాడుతూ ఈ ఎంపికలకు నగరవ్యాప్తంగా నాలుగు వేలమంది యువతీయువకులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అందులో 14 మంది తుది పోరులో నిలిచినట్లు తెలిపారు. చివరగా ముగ్గురిని ఎంపిక చేశామన్నారు.
ఇక కమిడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ ఈ మధ్యనే మరో కొత్త చిత్రం కమిటయ్యారు. రీసెంట్ గా రిలీజై బూతు చిత్రం అని పేరు తెచ్చుకున్న 'బస్‌స్టాప్' ఫేమ్ మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. గీతా ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు మారుతి మీడియాకు ఖరారు చేసారు. ఆయన మాట్లాడుతూ..''గీతా ఆర్ట్స్ పతాకంపై ఓ సినిమా రూపొందిస్తున్నాం. అందులో సునీల్ హీరోగా నటించే అవకాశాలున్నాయి''అన్నారు.
సునీల్ హీరోగా 'అందాల రాముడు' చిత్రాన్ని రూపొందించిన మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ తాజాగా హిందీలో హిట్టయిన 'తను వెడ్స్ మను'ను చిత్రాన్ని సునీల్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దేవిప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్త అయింది. ఈ చిత్రానికి 'మిస్టర్ పెళ్లి కొడుకు' అనే టైటిల్ ఖరారు చేసారు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బేనర్లో వస్తున్న 11వ చిత్రం ఇది.


Click it and Unblock the Notifications












