సునీల్‌ నుంచి ఇది ఊహించి ఉండరు.. షాక్‌కు గురి చేస్తున్న కమెడియన్

సునీల్.. ఈ పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. కమెడియన్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన ఈ టాలెంటెడ్ యాక్టర్.. ఎన్నో సినిమాల్లో అత్యత్తమ నటనను కనబరిచి కడుపుబ్బా నవ్వించాడు. కొన్నేళ్ల కిందట 'అందాల రాముడు' అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'మర్యాద రామన్న'లో లీడ్ రోల్ చేశాడు. అప్పటి నుంచి హీరోగానే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఎన్నో పరాజయాలను చవి చూశాడు. తాజాగా అతడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

వరుసగా పరాజయాలు ఎదురవుతున్న నేపథ్యంలో సునీల్ హీరోగా సినిమాలు చేయడం తగ్గించాడు. ఈ క్రమంలోనే గత ఏడాది జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ల‌లో వచ్చిన 'అరవింద సమేత'లో మరోసారి కామెడీ రోల్ చేశాడు. ఇక, తాజాగా అతడు మరో సరికొత్త అవతారం ఎత్తాడు. 'విజేత', 'మజిలీ', 'డియర్‌ కామ్రేడ్‌', 'ప్రతిరోజూ పండగే' వంటి సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న కమెడియన్‌ సుహాస్‌ హీరోగా 'కలర్ ఫొటో' అనే సినిమా రాబోతుంది. ఇందులో సునీల్ విలన్‌గా నటించబోతున్నాడు.

Sunil Will Play Negetive Role In Suhass First Film Colour Photo

ఈ సినిమాను 'హృదయ కాలేయం' వంటి వెరైటీ సినిమాకు దర్శకత్వం వహించిన స్టీవెన్‌ శంకర్‌ అలియాస్‌ సాయి రాజేష్, లౌక్యా ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. ఇందులో సుహాస్‌కు జంటగా చాందిని అనే హీరోయిన్ నటిస్తోంది. ఈ చిత్రంతో దర్శకుడిగా సందీప్ రాజ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే, కీరవాణి కుమారుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేచురల్ స్టార్ నాని ఆదివారం సాయంత్రం విడుదల చేశాడు. 'కలర్ ఫొటో అనే సినిమాను అనౌన్స్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎంతో టాలెంట్ ఉన్న వాళ్లందరూ కలిసి చేస్తున్న ఈ చిత్రాన్ని ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నా. నాకు తెలుసు వీళ్లంతా బాగా చేశారని' అని ట్వీట్ చేశాడు నాని. దీంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X