'మర్యాద రామన్న' చిత్రంలో రైస్ మిల్ ఉద్యోగిగా సునీల్
శుక్రవారం(జూలై 23)న రిలీజు కానున్న మర్యాదరామన్న చిత్రంలో సునీల్ రాము అనే పాత్రను పోషిస్తున్నాడు. రైస్ మిల్లులో పనిచేసుకునే అతనికి పెద్దగా సంపాదన కానీ ఆస్తికాని ఉండదు. అతనికి ఉన్న ఒకే ఒక ఆస్ది ఆప్తమిత్రుడు సైకిల్. దాని పుణ్యమా అనే అతని ఉద్యోగం ఊడుతుంది. అయితే ఓ రోజు తన తాతలనాటి ఆస్ధి రాయలసీమలో ఉందని తెలుస్తుంది. దాంతో ఆనందంగా అక్కడకి బయిలుదేరతాడు. అక్కడ అతినికి రామినీడు(నాగినీడు) ఆతిధ్యమిస్తాడు. రాయలసీమ సంప్రదాయం ప్రకారం అతిధిదేవోభవ..వచ్చిన అతిధిని దేవుడితో సమానంగా చూడాలని వారు గౌవరిస్తారు. అయితే అనుకోకుండా రామినీడుకి ఓ నిజం రాము గురించి తెలుస్తుంది. అది తాను ఎప్పుటినుంచో వెతుకుతున్న శత్రువు రాము అని అర్దమవుతుంది. దాంతో అతనిని చంపాలని నిర్ణయించుకుంటాడు. అయితే తమ ఇంట్లో ఉన్న అతిధిని ఏమీ చేయకూడదు. కాబట్టి ఎలాగయినా బయిటకు రప్పించి వేసెయ్యాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయం రాముకి తెలుస్తుంది. ఇంట్లోంచి బయిటకు వస్తే రామనీడు చేతిలో చావల్సి వస్తుందని..అందుకే అతను బయిటకు రావటానికి ఇష్టపడడు. అప్పుడు ఏమైంది. చివరకు రాము ఏమయ్యాడు అనేది మిగతా కథ.


Click it and Unblock the Notifications











