త్రివిక్రమ్ అలా సలహా ఇచ్చాడు
ఈ మధ్య ఓ పది రోజులు ఖాళీ వచ్చింది. 'నీ సినిమాలో మంచి వేషం ఉంటే చెప్పు.. చేస్తా' అని త్రివిక్రమ్‌ని అడిగాను. 'నీ పంథా మార్చుకోకు. ముందు హీరో పాత్రలవైపు దృష్టిపెట్టు' అని సలహా ఇచ్చాడు'' అని సునీల్ చెప్పారు.'పూలరంగడు'చిత్రం ఘన విజయం సాధించిన సునీల్ ఈ రోజు(మంగళవారం)పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే ''హాస్యనటుడిగా ఒకే రోజు ఐదారు కాల్షీట్లు ఇచ్చేవాడిని. ఇప్పుడు అవన్నీ హీరోగా ఒకే సినిమాకు ఇస్తున్నా. హోదా మారినా చేతినిండా పని, దానికి నేనిచ్చే విలువ మారలేదు. ఇక హాస్యనటుడిగా నాలుగైదు సన్నివేశాల్లో కనిపిస్తే చాలు. హీరోగా సినిమా అంతా నాపైనే నడుస్తుంది. నేను లేని సన్నివేశాలపై కూడా దృష్టిపెట్టాలి. అందుకే హీరోగా నటించడమే కష్టం అనిపిస్తుంది. హాస్యనటుడిగా ప్రతీ నిమిషం ఆస్వాదించా. హీరో పాత్ర పోషిస్తున్నప్పుడు ఆ ఆనందం కనిపించదు. అందుకే హాస్య పాత్రలకూ నేను సిద్ధంగానే ఉన్నాను అన్నారు. ఇక సునీల్ హీరోగా 'తను వెడ్స్ మను' రీమేక్ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఈ సినిమా గురించి చెబుతూ ''హిందీ సినిమా నేను చూశాను. బాగా నచ్చింది. అయితే మాధవన్ పాత్ర నా శైలికి పూర్తి భిన్నంగా ఉంటుంది. తెలుగులో నాకోసం కొంచెం అల్లరి జోడించారు. వినోదాత్మక చిత్రాలనే ఎంచుకొంటాను. అవి లేని కథలు ఒప్పుకోలేను'' అన్నారు . ఇక సునీల్ కి పుట్టిన రోజు సందర్భంగా ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











