Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అందరూ ఆ విధంగా అంటున్నారు.. పెళ్లిపై సునీత కామెంట్స్
సింగర్ సునీత్ రామ్ వీరపనేని పెళ్లిపై ఎన్ని రకాల అభిప్రాయాలు వెలువడ్డాయో అందరికీ తెలిసిందే. ఈ రెండో పెళ్లిని కొందరు వ్యతిరేకించారు. ఇంకొందరు మాత్రం సునీత నిర్ణయాన్ని సమర్థిస్తూ మద్దతిచ్చారు. అయితే ఎవరు ఎలా అనుకున్నా కూడా సునీత ఫ్యామిలీ మాత్రం ఆమెకు బలంగా మారింది. అలా సునీత రామ్ వివాహాంపై పలువురు పలురకాలుగా కామెంట్లు చేస్తూనే ఉన్నారని, తాజాగా వాటిపై సునీత స్పందించింది.
స్నేహితుడే..
రామ్ వీరపనేని ఎన్నో యేళ్ల నుంచి సునీతకు పరిచయం. ఆమె సోషల్ మీడియా ఖాతాలాను హ్యాండిల్ చేసేది కూడా ఆయనే అంటా. అలా పెరిగిన స్నేహమే చివరకు ఇలా వివాహా బంధంగా మారిందని చెప్పుకొచ్చింది. లాక్‌డౌన్‌లోనే ఏదో జరిగిందంటూ సునీత అసలు విషయాలన్నీ చెప్పేసింది.
ఆ రోజు అలా..
లాక్డౌన్లో ఆలోచనలు మారిపోయానని, అప్పుడే ఏదో జరిగిందని సునీత తెలిపింది. ఓ రోజు సడెన్‌గా రామ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు.. చీర పెట్టారు.. అంతా షాక్.. పిల్లలకు అసలు విషయం అర్థం కాలేదు.. ఆ సమయంలో కాస్త ఫీలయ్యారు.. ముందే తెలిస్తే మేం కూడా రెడీ అయ్యేవాళ్లం కదా అని అన్నారంటూ పెళ్లిపై తన పిల్లల అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేసింది.
తాజాగా ఇలా..
అయితే సునీత తాజాగా స్టార్ మా చేస్తోన్న 100 పర్సెంట్ లవ్ షోలో అలరించింది. రియల్ జంటలు రీల్ జంటలు అని పెట్టిన ఈ షోలో సునీత చివరి టచ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. తనదైన శైలిలో తియ్యని పాటలు పాడి అందరినీ ఆకట్టుకుంది.
సర్ప్రైజ్ అలా..
సునీత పాటలు పాడుతూ ఉంటే.. రామ్ వెనకలా వచ్చి నిల్చున్నాడు. ఆ విషయం తెలియని సునీత పాట పాడటంతో నిమగ్నమైంది. పాట అంతా అయిపోయి కళ్లు తెరిచే సరికి రామ్ ఉండటంతో ఆశ్చర్యపోయింది. అలా రామ్‌ను చూసే సరికి సునీత హత్తుకుని ఎమోషనల్ అయింది.
బోల్డ్ స్టెప్..
మా పెళ్లిని అందరూ బోల్డ్ స్టెప్ అంటున్నారు.. నాకు తెలిసి అది కరెక్ట్ స్టెప్ అనే అనుకుంటున్నాను అని సునీత చెప్పుకొచ్చింది. అది గోల్డ్ స్టెప్ అని సీరియల్ నటుడు ప్రభాకర్ ఆమె నిర్ణయానికి మద్దతు తెలిపాడు. అలా అనడంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు.