Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారికి థాంక్స్, నేనే చెబుతా, విడాకుల గురించి.. సింగర్ సునీత!
Recommended Video
సింగర్ సునీత పేరు తెలియని సినీ అభిమాని ఉండరు. మధురమైన గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆమె పేరు ప్రతిష్టలు సంపాదించారు. సెలెబ్రిటీలు రూమర్స్ బారీన పడడం సహజమే. కానీ ఆ రూమర్స్ మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయితే వారికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అదే పరిస్థితిని సునీత ఎదుర్కొన్నారు. సునీత వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తుండడంతో సోషల్ మీడియా లైవ్ లో క్లారిటీ ఇచ్చారు. చిరునవ్వుతోనే ఆమె ఈ రూమర్స్ పై తన స్పందన తెలియజేశారు.
ఆ ఆలోచన లేదు
వరుసగా మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వస్తుండడంతో ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వాలని అనిపించింది. ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నా.. నాకు అటువంటి ఆలోచన ప్రస్తుతం లేదని సునీత అన్నారు.
ఇంత అభిమానమా
నాకు సంబందించిన రూమర్ గురించి ఈ స్థాయిలో మాట్లాడుకుంటున్నారా అని ఆశ్చర్యపోయా. అదే సమయంలో నాపై ఇంత అభిమానం ఉందా అని కూడా అనిపించింది. నేను పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని ఇంత మంది కోరుకుంటున్నందుకు కృతజ్ఞతలు. కానీ ప్రస్తుతం నాకు ఆ ఆలోచన లేదు.
భవిషత్తులో
దయచేసి ఇటువంటి రూమర్స్ సృష్టించవద్దు. భవిషత్తులో ఇటువంటిది ఏదైనా ఉంటే మీ అందరి విషెష్ తోనే జరుగుతుంది. ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు అంటే.. తాను ఏ విషయంలోనూ ఎవ్వరికీ క్లారిటీ ఇవ్వవలసిన అవసరం లేదు.
నంది అవార్డు వచ్చినప్పుడు
నాకు
నంది
అవార్డు,
ఫిలిం
ఫేర్
అవార్డు
వచినప్పుడు
ఇన్ని
మెసేజ్‌లు,
ఫోన్
కాల్స్
రాలేదు.
వెబ్
సైట్స్
లో
కూడా
రాలేదు.
ఈ
పరిస్థితి
నాకు
మాత్రమే
కాదు..
ప్రతి
సెలెబ్రిటికి
ఉండేదే
అని
సునీత
పేర్కొన్నారు.
విడాకుల గురించి
నాజీవితంలో విడాకులు జరిగి చాలా కాలం అవుతోంది. ఏమి చేసినా లీగల్ గానే చేస్తా. ఒకవేళ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఆ హక్కు నాకు ఉంది. మరోమారు చెబుతున్నా అలాంటిదేసమైనా ఉంటె మీ విషెష్ తోనే పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతం వస్తున్న వార్తలకు ఆధారం లేదు. నా గురించి నేను చెబితేనే ఆ వార్తకు ఆధారం ఉన్నట్లు అని సునీత పేర్కొన్నారు.