నా ఛిద్రమైన జీవితం లో వెలుగులు నింపిన వ్యక్తి.. ఎస్పీబీని తలుచుకుని సునీత ఎమోషనల్
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. కోట్ల మంది అభిమానుల్ని ఒంటరి చేసి స్వర్గానికి పయనమయ్యారు. ఆగస్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆరోగ్యం మాత్రం కుదుటపడేలేదు. నిన్న సాయంత్రం పరిస్థితి విషమించడంతో నేడు (సెప్టెంబర్ 25) ఒంటి గంట నాలుగు నిమిషాలకు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఎస్పీబీ మరణంతో సుమ, స్మిత, సింగర్ యామిని, సునీత, అనసూయ ఎమోషనల్ అయ్యారు.

నా ఆత్మ బంధువు. నా మావయ్య.
నా ఛిద్రమైన జీవితం లో వెలుగులు నింపిన వ్యక్తి. నాకు పాట మీద ప్రేమ కలిగించి, పాడాలనే తపన పెంచి, నా బాగోగులు గమనిస్తూ నాకు బాసటగా నిలుస్తూ జీవితం మీద మమకారం పెంచిన వ్యక్తి నా ఆత్మ బంధువు. నా మావయ్య. భౌతికంగా లేరు అంతే. అంటూ సునీత భావోద్వేగానికి లోనైంది.

వేల పాటలకు ప్రాణాలు పోయడమే కాదు..
1997లో మీ ఆశీర్వాదంతోనే నా ప్రయాణాన్ని ప్రారంభించాను. వేల పాటలకు ప్రాణాలు పోయడమే కాదు.. ఎంతో మంది మ్యూజీషియన్లకు జీవితాన్ని అందించారు. మీ పాటలతో మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఎస్పీబీ మరణం పట్ల స్మిత ఎమోషనల్ అయింది.

మిస్ యూ బాలు గారు
బాలు గారి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను.. నేను ఎదుగుతున్న సమయంలో మీ పాటలు నా జీవితంలో భాగంగా మారాయి.. ఆ తరువాత మీ పాటలు మా జీవితంలో ఎప్పటికీ భాగమవుతూ ఉంటాయి. మిస్ యూ బాలు గారు అని సుమ ఎమోషనల్ అయింది.

నాకు మొదటి గుర్తు మీరే.
సంగీతం అంటే నాకు మొదటి గుర్తు మీరే. ఇప్పటికి ఎప్పటికీ కూడా మీరే బాలు గారు. మీ పాట వినని రోజు గడవలేదు గడవదు కూడా. మీరు చిరంజీవి బాలు గారు.. పైలోకి మీ గాత్రాన్ని ఆస్వాధిస్తుంది ఇక నుంచి.. సెలవు.. మళ్లీ కలిసే వరకు అంటూ అనసూయ తీవ్ర భావోద్వేగానికి లోనైంది.
Recommended Video

హృదయాన్ని బద్దలుకొట్టింది.
2020 అనేది ఎన్నో రకాలుగా బాధపెడుతోంది. ఇది మాత్రం హృదయాన్ని బద్దలుకొట్టింది. ఎంతో కలత చెందాను. ఎస్పీబీ సర్ మిమ్మల్ని మిస్ అవుతున్నాము.. మీతో గడిపిన కొన్ని క్షణాలైనా సరే మీరు ఎన్నో సంగీత, జీవిత పాఠాలు నేర్చుకున్నాను అంటూ సింగర్ సత్య యామిని ఎమోషనల్ అయింది.


Click it and Unblock the Notifications











