ఫ్లాప్ దర్శకుడితో 'సింగర్ సునీత' !!
'ఈ వేళలో నీవు ఏం చేస్తువుంటావు' పాటతో ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన స్వరమాధురి సునీత. ఆ పై తనదైన మెలోడి స్వరంతో ఎన్నో పాటలు పాడి అందరి అభిమానాన్ని చూరగొంది. ఈ మధ్యన బుల్లితెర పై 'సరిగమప', 'ఝుమ్మందినాదం' వంటి సంగీత నేపథ్య కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించిన సునీత, ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తబోతోంది.
'ఓయ్' చిత్ర దర్శకుడు ఆనంద్ రంగా తో కలిసి సంయుక్తంగా నిర్మించబోయే ఈ చిత్రానికి రాజ్ పిప్పాల దర్శకత్వం వహించబోతున్నారు. రాజ్ 'బోణి' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైనాడు. సుమంత్, కృతి జంటగా వచ్చిన ఈ చిత్రంతో బోణి చెయ్యలేకపోయిన రాజ్ కనీసం ఈ చిత్రంతో నైనా హిట్ ఇస్తాడో లేదో చూడాలి. నటీనటులు మరియు ఇతర వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
sunitha oye anand ranga raj pippala boni shamili sumanth siddharth సునీత ఓయ్ బోణి రాజ్ పిప్పాల ఆనంద్ రంగా షామిలి సిద్ధార్థ సుమంత్ కృతి


Click it and Unblock the Notifications