అపుడు ఐశ్వర్యరాయ్...ఇపుడు సన్నీ లియోన్!

By Bojja Kumar

హైదరాబాద్: 1999లో ఐశ్వర్యరాయ్, సల్మాన్‌ఖాన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం హమ్‌దిల్ దే చుకే సనమ్ చిత్రంలో ఐశ్వర్యరాయ్‌పై తెరకెక్కించిన ధోలీ తారో ధోలీ భాజే అనే పాట ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ పాటకు అప్పట్లో పలు అవార్డులు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈ గీతం రీమిక్స్ రూపంలో సన్నీ లియోన్ నటిస్తున్న లీలా చిత్రంతో ప్రేక్షకులు చూడబోతున్నారు.

సన్నీలియోన్ కథానాయికగా నటిస్తున్న లీలా చిత్రానికి బాబీఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ పాట రీమిక్స్ హక్కులను హమ్‌దిల్‌దే చుకే సనమ్ నిర్మాత భూషణ్‌కుమార్ నుంచి సొంతం చేసుకున్న బాబీఖాన్ దీనిని సన్నీలియోన్‌పై తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం సన్నీ లియోన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది.

 Sunny dances to Ash's tune

సన్నీ లియోన్ అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఆమె గతంలో నటించిన సెక్స్ సినిమాలే. తక్కువ కాలంలోనే ఆమెకు ఇంత గుర్తింపు రావడానికి కారణం కూడా ఆమె గత సినిమాలే. అయితే బాలీవుడ్లో వచ్చిన తర్వాత సన్నీ లియోన్ పూర్తిగా మారి పోయింది. సెక్స్ సినిమాలకు దూరంగా ఉంటూ భారతీయ సినిమాల్లో బిజీ అయిపోయింది. బాలీవుడ్లో ఆమెను తొలుత గ్లామర్ పాత్రలు, ఐటం సాంగ్స్ అవకాశాలు వచ్చాయి. అచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని గుర్తింపు తెచ్చుకుంది. మెల్లి మెల్లిగా బాలీవుడ్లో సన్నీ లియోన్ తన రూటు మార్చుకుంటోంది. సన్నీ అంటే సెక్స్ సినిమాలు కాదు, మంచి నటి అనే పేరు తెచ్చుకోవాలని తాపత్రయ పడుతోంది. ప్రత్యేక గీతాలు, గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ఆస్కారమున్న పాత్రల ద్వారా హీరోయిన్‌గా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

లీలా చిత్రంలో సన్నీలియోన్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనుందట. అశ్లీలత లేకుండా క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని దర్శకుడు బాబీఖాన్ తెలిపారు. ఈ సినిమా గురించి సన్నీలియోన్ మాట్లాడుతూ ఒకే సినిమాలో మూడు భిన్నమైన పాత్రల్ని పోషించడం మధురానుభూతినిస్తోంది. ఓ సవాల్‌లా స్వీకరించి ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో నాపై వున్న శృంగార తార ముద్ర చెరిగిపోతుందన్న నమ్మకముంది. నా కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలుస్తుంది అని అంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X